News March 10, 2025

భారత్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ.. యాదాద్రిలో సంబరాలు

image

ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ భారత్ జట్టు గెలవడంతో సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో యువకులు జాతీయ పతాకంతో సంబరాలు జరుపుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా అద్భుతమైన ప్రదర్శనతో కప్పును ముద్దాడడంతో గుజ్జ గ్రామస్థులు ఆనందాల్లో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో ఎలిజాల శ్రీను, చాడ శ్రీను, వెంకటేశ్, శ్రీకాంత్, సమరం, లింగస్వామి, సీతారాం, ప్రకాశ్ పాల్గొన్నారు.

Similar News

News March 25, 2026

జగిత్యాల: జాతీయ స్థాయిలో RSI రమేశ్ సత్తా

image

జమ్మూకశ్మీర్ పోలీస్ ఆధ్వర్యంలో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్(ఖోఖో) పోటీల్లో తెలంగాణ పోలీస్ తరఫున జగిత్యాల రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ రమేశ్ పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఆయన కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ రమేశ్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ స్థాయిలో విజయాన్ని సాధించడం గర్వకారణమని పేర్కొంటూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

News March 25, 2026

పెట్రోల్ ధరలు పెరగవు: కేంద్రం

image

దేశంలో తగినంత మేర ఇంధన నిల్వలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ స్పష్టంచేశారు. రూమర్లను నమ్మి ప్రజలు పానిక్ బయింగ్ చేయొద్దని కోరారు. మరోవైపు పైప్డ్ నేచురల్ గ్యాస్(PNG) కనెక్షన్లకు అవకాశం ఉన్నా వినియోగించుకోని వారికి LPG కనెక్షన్లను కట్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. 3 నెలల్లోగా PNGకి మారకపోతే LPG సరఫరా ఆపేస్తామని చెప్పింది.

News March 25, 2026

NTR: సైన్స్-1 పరీక్షకు 277 మంది విద్యార్థులు గైర్హాజరు

image

జిల్లా వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన సైన్స్ పేపర్-1 పరీక్షకు 27,741 మంది విద్యార్థులకు గానూ 27,464 మంది విద్యార్థులు హాజరయ్యారని NTR DEO చంద్రకళ తెలిపారు. 277 మంది విద్యార్థులు గైర్ హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తంగా 99.1 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. ఓపెన్ స్కూల్ సొసైటీ విద్యార్థులు 640 మందికి గానూ 504 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు.