News March 10, 2025
KL రాహుల్.. ది అన్సంగ్ హీరో!

2023 వన్డే WC ఓడిపోవడానికి ఇతనే కారణం. పంత్ ఉండగా ఇతడినెందుకు ఆడిస్తున్నారు. కీపింగ్ సరిగా చేయట్లేదు. ఇవన్నీ CTలో KL రాహుల్‌పై వచ్చిన విమర్శలు. ‘నేను ఇంకేం చేయాలి?’ అని ఇటీవల రాహుల్ అన్నారంటే ఆ విమర్శల తీవ్రత ఏంటో అర్థం అవుతోంది. సెమీ ఫైనల్లో AUSతో మ్యాచులో సిక్స్ కొట్టి గెలిపించడమే కాకుండా ఫైనల్లో టీమ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు రాహుల్(34*) ఆడిన తీరు అద్భుతం. జట్టును గెలిపించిన తీరు అద్వితీయం.
Similar News
News January 11, 2026
చైనా, అమెరికాకు సాధ్యం కానిది ఇండియా సాధించింది: చంద్రబాబు

AP: బెంగళూరు-కడప-విజయవాడ కొత్త నేషనల్ హైవే వారం రోజుల వ్యవధిలోనే 4 గిన్నిస్ రికార్డులను సాధించిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 57,500 టన్నుల బిటుమినస్ కాంక్రీటుతో 156 లేన్ కి.మీ రహదారి నిర్మించారని కాంట్రాక్ట్ కంపెనీ రాజ్‌పథ్ ఇన్ఫ్రాకన్ లిమిటెడ్, NHAIను అభినందించారు. కొత్త రోడ్ల నిర్మాణంలో అమెరికా, చైనా, జర్మనీకి సాధ్యం కానిది.. భారత్ సుసాధ్యం చేసిందని ట్వీట్ చేశారు.
News January 11, 2026
లేట్ కాకముందే డీల్ చేసుకోండి.. క్యూబాకు ట్రంప్ హెచ్చరిక

క్యూబాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. తమతో వీలైనంత త్వరగా ఒప్పందం కుదుర్చుకోవాలని స్పష్టం చేశారు. ‘ఇకపై క్యూబాకు ఆయిల్ లేదా డబ్బు వెళ్లదు. ఆలస్యం కాకముందే డీల్ చేసుకోవాలని సూచిస్తున్నా. వెనిజులా నుంచి వస్తున్న ఆయిల్, డబ్బుతో చాలా ఏళ్లు క్యూబా బతికింది. అందుకు బదులుగా వెనిజులాకు సెక్యూరిటీ సర్వీసెస్ అందించింది. ఇకపై అలా జరగబోదు’ అని ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు.
News January 11, 2026
కోహ్లీ సెంచరీ మిస్

స్టార్ క్రికెటర్ కోహ్లీ త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నారు. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో 91 బంతుల్లో 93 పరుగులు చేసి ఔటయ్యారు. జెమీసన్ బౌలింగ్‌లో బ్రేస్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. దీంతో కింగ్ నుంచి మరో సెంచరీ చూడాలనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. విరాట్ ఔటయ్యే సమయానికి భారత్ స్కోర్ 234/3. టీమ్ ఇండియా విజయానికి 64 బంతుల్లో 67 రన్స్ అవసరం.


