News March 10, 2025
భారత జట్టుకు ప్రధాని అభినందనలు

ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన భారత జట్టుకు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. టోర్నీ మొత్తం టీమ్ ఇండియా అద్భుతంగా ఆడిందని కొనియాడారు. ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిందని ప్రశంసించారు. జట్టులోని ప్లేయర్లంతా స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. CT విజేతగా నిలిచిన భారత జట్టుకు సినీ నటులు చిరంజీవి, మహేశ్ బాబు, ఎన్టీఆర్ అభినందనలు తెలియజేశారు.
Similar News
News March 10, 2025
ఆ రైతులకూ రూ.20వేలు: మంత్రి అచ్చెన్న

AP: అర్హులైన ప్రతి రైతుకు ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ.20 వేలు ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో అన్నారు. కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి బ్యాంకుల్లో జమ చేస్తామని వెల్లడించారు. కౌలు రైతులు, వెబ్ ల్యాండ్‌లో నమోదైన వారికీ పథకం వర్తిస్తుందన్నారు. మరో మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. రూ.30 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తెచ్చామన్నారు. 16 రకాల ఇన్సెంటివ్స్ ఇస్తున్నామని వివరించారు.
News March 10, 2025
ట్రంప్ టారిఫ్స్‌తో భారత్‌కు మేలు: RBI మాజీ డిప్యూటీ గవర్నర్

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ పెంపుతో భారత్‌కు మేలు జరగొచ్చని RBI మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య అన్నారు. కంపెనీల మధ్య ఇది పోటీతత్వం పెంచుతుందని అంచనా వేశారు. ఫలితంగా తయారీ, ఉత్పత్తిలో నాణ్యత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. మానవ వనరుల నైపుణ్యంపై కంపెనీలు పెట్టుబడులు పెడతాయని పేర్కొన్నారు. ఆరంభంలో మార్జిన్లు తగ్గినా చివరికి మంచే జరుగుతుందని వెల్లడించారు.
News March 10, 2025
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు

AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు పేరును బీజేపీ ప్రకటించింది. కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోము వీర్రాజు గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. ఎన్డీయే కూటమిలో టీడీపీ తరఫున గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు, జనసేన నుంచి నాగబాబు పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి.