News March 10, 2025
కోటప్పకొండలో ఐఏఎస్ అధికారి పూజలు

నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండ పై వేంచేసి ఉన్న త్రికోటేశ్వర స్వామిని ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణ తేజ ఆదివారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుతో కలిసి నిర్వహించారు. ఆలయ అధికారులు,అర్చకులు వారికి స్వాగతం పలికారు. స్వామి వారి మహిమలను తెలిపారు. శేష వస్త్రాన్ని, ప్రసాదాలను, త్రికోటేశ్వరుని చిత్రపటాన్ని కృష్ణ తేజకు అందించి సత్కరించారు.
Similar News
News March 13, 2026
KNR: బండి సంజయ్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’కు సవాళ్లు!

కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈనెల 14న చేపట్టనున్న ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’లో భాగంగా KNR నుంచి కొండగట్టు వరకు సాగే 40 కి.మీ పాదయాత్రపై భానుడి ప్రతాపం, ట్రాఫిక్ చిక్కుల ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. ఆరోజు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించడం, అదే రోజు పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు సవాలుగా మారనున్నాయి. దీంతో యాత్ర సాగే తీరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
News March 13, 2026
కందిలో ఆకుగూడు పురుగు – నివారణకు సూచనలు

కంది పంట ఎదుగుదల దశలో ఎక్కువగా, ఒక్కోసారి పూత దశలో కూడా ఆకుగూడు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు లార్వాలు కంది మొక్కల చిగురు ఆకులను గూడుగా చేసి, లోపల ఉండి ఆకులను, పువ్వులను, లేత కాయలను కూడా తొలిచి తింటాయి. ఈ పురుగు నివారణకు లీటరు నీటిలో క్వినాల్‌ఫాస్ 25% ఇ.సి. 2.0 మి.లీ. (లేదా) మోనోక్రోటోఫాస్ 36% యస్.యల్ 1.6 మి.లీ. కలిపి పంటపై పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
News March 13, 2026
గిరిజనులకు పక్కా ఇళ్లు.. పురోగతిపై వివరణ కోరిన MP

గిరిజన కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణం పురోగతిపై ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డి గురువారం లోక్ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఎంజేయూజీఏ కింద ST కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రాలవారి పురోగతి, అర్హులైన గిరిజన కుటుంబాలను ఎలా గుర్తిస్తున్నారని ప్రశ్నించారు. ఇందుకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.


