News March 10, 2025

ఏలూరు: కలెక్టరేట్‌లో నేడు పీజీఆర్ఎస్ కార్యక్రమం 

image

ఏలూరు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెట్రీ సెల్వీ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో గత సోమవారం వరకు జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో, మండలాల పరిధిలో ఈ కార్యక్రమం రద్దు చేశారు. కోడ్ ముగియడంతో ఈ సోమవారం జిల్లా, రెవెన్యూ, మండల స్థాయిలో యధావిధిగా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.

Similar News

News October 26, 2025

NLG: లక్ ఎవరిని వరిస్తుందో..!

image

కొత్త మద్యం పాలసీ నిర్వహణకు వేలైంది. ప్రభుత్వం గత నెల 26 నుంచి ఈ నెల 23వరకు మద్యం టెండర్ల దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలో 154 మద్యం దుకాణాలకు 4,906 దరఖాస్తులు వచ్చాయి. లక్కీడ్రా పద్ధతిలో సోమవారం షాపులు కేటాయించనున్నారు. ఇందుకు నల్గొండలోని లక్ష్మీ గార్డెన్స్‌లో ఏర్పాట్లు చేస్తుండగా జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి సంతోష్ పరిశీలించారు.

News October 26, 2025

విజయనగరంలో 4 ప్రైవేట్ బస్సులు సీజ్

image

నగరంలో రవాణా శాఖాధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఉపరవాణా కమిషనర్ మణికుమార్, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లతో కలసి వాహన రికార్డులు, ఫైర్ ఎక్విప్మెంట్, సీటింగ్‌ బెర్త్‌లను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిని 4 వాహనాలను సీజ్ చేసి ఆర్టీఓ కార్యాలయానికి తరలించారు.

News October 26, 2025

హోప్ ఐలాండ్‌కు అధికారులు.. రామంటున్న మత్స్యకారులు

image

తాళ్లరేవు మండలం కోరంగి సమీపంలోని హోప్ ఐలాండ్‌లో ఉన్న 110 మంది మత్స్యకారులను తుపాను నేపథ్యంలో తరలించేందుకు కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, జిల్లా పోలీసు అధికారులు అక్కడికి వెళ్లారు. అయితే తుపానులు తమకు అలవాటేనంటూ వారు సురక్షిత ప్రాంతాలకు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినడం లేదని ఆర్డీఓ వెల్లడించారు.