News March 10, 2025
జనగామ: పదో తరగతి పరీక్షలకు 41 పరీక్ష కేంద్రాలు

ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు జనగామ జిల్లాలో 41 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనగామ జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లోని అన్ని వసతులున్న పాఠశాలలను కేంద్రాలుగా గుర్తించారు. మరో 11 రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా కేంద్రాల్లో ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
Similar News
News March 16, 2026
వనపర్తి: ఉరేసుకొని ఉపాధ్యాయురాలి మృతి

వనపర్తి పట్టణంలోని న్యూటౌన్ కాలనీకి చెందిన ఉపాధ్యాయురాలు రాకాసి శ్రీదేవి (45) ఆదివారం తన నివాసంలో ఉరివేసుకొని మృతి చెందినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాలు మృతురాలు కొన్ని రోజులుగా మానసిక రోగంతో బాధపడుతున్నదని భర్త పిల్లలు ఇంట్లో లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
News March 16, 2026
సూర్యాపేట: GREAT.. ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నీకి సెలక్ట్

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన యువ క్రికెటర్ బొబ్బ భరత్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ టోర్నీకి ఎంపికయ్యారు. శ్రీలంకలో జరగనున్న ఇంటర్నేషనల్ ఓపెన్ టీ20, వన్డే టోర్నమెంట్లలో ఆయన ఆడనున్నారు. ఇప్పటివరకు 100కు పైగా వికెట్లు తీసిన భరత్‌ను MLA జగదీశ్ రెడ్డి అభినందించారు. మహ్మద్ సిరాజ్ స్ఫూర్తితో ఐపీఎల్, భారత జట్టులో చోటే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నానని భరత్ చెబుతున్నారు.
News March 16, 2026
స్కూళ్లు, అంగన్‌వాడీలు నేటి నుంచి ఒంటిపూటే

AP, TGలో ఇవాళ్టి నుంచి స్కూల్ విద్యార్థులకు ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. APలో ఉ.7.45 గంటలకు, TGలో ఉ.8 గంటలకు ప్రారంభమై మ.12.30 గంటలకు ముగుస్తాయి. ఇక అంగన్‌వాడీలనూ నేటి నుంచే ఒంటిపూట నిర్వహించాలని AP శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. పాఠశాలల మాదిరే ఏప్రిల్ 23 వరకు ఇవి కొనసాగనున్నాయి. ఉ.8 గంటల నుంచి మ.12.30 గంటల వరకు కేంద్రాలు తెరిచి ఉంటాయని, చిన్నారుల పేరెంట్స్ గమనించాలని సూచించింది.


