News March 10, 2025
పెద్దపల్లి: నేడు ప్రజావాణి పునః ప్రారంభం

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం ఉదయం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో భాగంగా తాత్కాలికంగా కొద్ది వారాల పాటు రద్దు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో తిరిగి ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 10 సోమవారం తిరిగి పునః ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పేర్కొన్నారు. కావున జిల్లాలోని అర్జీదారులు వినియోగించుకోవాలని సూచించారు.
Similar News
News March 16, 2026
ఏ పార్టీలో చేరాలనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు: రాజాసింగ్

TG: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తాను BJLP ఛాంబర్‌కి వెళ్లడంపై MLA రాజాసింగ్ స్పందించారు. ‘పాత ఇల్లు, పాత ఫ్రెండ్స్ కాబట్టి వెళ్లా. ఇంకా ఏ పార్టీలో చేరాలనేది డిసైడ్ అవ్వలేదు. ఎవరిని ఎవరు బతిమాలుతున్నారో భవిష్యత్తులో తెలుస్తుంది’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా BJLP ఛాంబర్ నుంచి వస్తున్న రాజాసింగ్‌ను చూసిన KTR ‘BJP నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి అక్కడికి ఎలా వెళ్లారు?’ అని సరదాగా ఆటపట్టించారు.
News March 16, 2026
కొత్తగూడెం: సింగరేణి ఉద్యోగులకు 18న రంజాన్ అడ్వాన్స్

సింగరేణిలో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులకు రంజాన్ అడ్వాన్స్‌ను ఈనెల 18న చెల్లించనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. పండుగ వేళ ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా ఈ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. నిబంధనల ప్రకారం.. సంస్థలోని శాశ్వత ఉద్యోగులకు రూ.25,000, ఇతర కేటగిరీ ఉద్యోగులకు రూ.12,500 చొప్పున అడ్వాన్స్ అందజేయనున్నారు. ఈ నిర్ణయంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News March 16, 2026
నందిని సిధారెడ్డికి సాహిత్య అకాడమీ అవార్డు

TG: ప్రముఖ రచయిత నందిని సిధారెడ్డి రచించిన ‘అనిమేష’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 24 భారతీయ భాషలలో ఈ సాహిత్య అవార్డులను అకాడమీ ప్రకటించింది. ‘అనిమేష’తో పాటు ఆయా భాషల్లోని రచయితల సాహిత్య పుస్తకాలకు అవార్డులను ప్రకటించింది. కొవిడ్ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న వేదన, భయం, సంఘర్షణలను ప్రతిబింబించే కావ్యమిది. అప్పటి పరిస్థితులను అక్షరరూపంలో కళ్లకు కట్టేలా రచయిత ఆవిష్కరించారు.


