News March 10, 2025

తిరుపతి: బీదకు ఎమ్మెల్సీ.. బీసీలపై బాబు ప్రేమకు నిదర్శనం

image

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కావలికి చెందిన బీద రవిచంద్ర యాదవ్‌ను టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది చంద్రబాబు బీసీలపై చూపుతున్న ప్రేమ, ఆప్యాయతలకు నిదర్శనమని తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు నెలవల ప్రసాద్, వేంపల్లి వెంకటేశ్వర్లు యాదవ్, ఇతర యాదవ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News November 5, 2025

ఉసిరి దీపాన్ని ఎలా తయారుచేసుకోవాలి?

image

కార్తీక మాసంలో ఉసిరి దీపం పెట్టడం అత్యంత పవిత్రమైన ఆచారం. ఈ దీపాన్ని వెలిగించడానికి గుండ్రని ఉసిరికాయను తీసుకుని, దాని మధ్య భాగంలో గుండ్రంగా కట్ చేయాలి. ఆ భాగంలో స్వచ్ఛమైన నూనె లేదా ఆవు నెయ్యి వేయాలి. ఆ నూనెలో వత్తి వేసి వెలిగించాలి. ఇలా ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల సకల దేవతల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నవగ్రహ దోషాలు తొలగి ఇంట్లో సుఖశాంతులు చేకూరుతాయని భక్తుల నమ్మకం.

News November 5, 2025

ఉపరితల ఆవర్తనంతో ఈ జిల్లాల్లో వర్షాలు!

image

కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ APలోని కోనసీమ, కృష్ణా, GNT, బాపట్ల, ప్రకాశం, NLR, కర్నూలు, కడప, TPT జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అటు TGలో ఇవాళ్టితో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో వర్షాలు ముగుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.

News November 5, 2025

పాలమూరు వర్సిటీకి మరో గౌరవం

image

పాలమూరు వర్సిటీ విద్యా విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వై.శ్రీనివాస్ “వాలీబాల్ ప్లేయర్స్‌పై డాటా డ్రీవన్ మానిటరింగ్ సిస్టం” అనే అంశంపై యూటిలిటీ పేటెంట్ పొందారు. ఈ మేరకు ఉపకులపతి ప్రొఫెసర్ జి.ఎన్.శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పూస రమేష్ బాబు ఆయనను అభినందించారు. నూతన ఆవిష్కరణల్లో మరింత చురుకుగా పాల్గొనాలని వీసీ కోరారు.