News March 10, 2025
బైంసా: 16 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు

గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం జరిగిన ఓపెన్ యూనివర్సిటీ 3వ సెమిస్టర్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ కింద ముగ్గురు విద్యార్థులు బుక్ అయినట్లు కళాశాల ప్రిన్సిపల్ కర్రోల్ల బుచ్చయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష కేంద్రంలో ఇప్పటివరకు మొత్తం 16 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌లో పట్టుబడ్డట్లు ఆయన పేర్కొన్నారు.
Similar News
News July 4, 2025
గంభీరావుపేట్: ‘త్వరగా పూర్తిచేసుకుని సాయం పొందాలి’

ఇందిరమ్మ ఇళ్ళను త్వరగా పూర్తిచేసుకుని ప్రభుత్వం నుంచి సాయం పొందాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గంభీరావుపేట మండలం గోరింటాలలో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణాలలో లబ్ధిదారులకు అధికారులు సహకరించాలని సూచించారు. డీఆర్డీఓ శేషాద్రి, ఎంపీడీవోలు, తహసిల్దార్ లు ఉన్నారు.
News July 4, 2025
ఏలూరులో వినతులు స్వీకరించిన ఎస్పీ

ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ ప్రతాప్ కిషోర్ సిబ్బంది సమస్యలను వినతుల రూపంలో స్వీకరించారు. జిల్లాలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్‌లలో పనిచేస్తున్న పోలీసులు, ఏఆర్ సిబ్బంది, హోమ్ గార్డ్‌లు వారి సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని ఎస్పీ హామి ఇచ్చారు.
News July 4, 2025
ఇంగ్లండ్ దూకుడు.. ఒక్క ఓవర్లోనే 23 రన్స్

INDతో రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు బ్రూక్ (57*), స్మిత్ (57*) దూకుడుగా ఆడుతున్నారు. 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ప్రసిద్ధ్ వేసిన 32వ ఓవర్లో స్మిత్ వరుసగా 5 బౌండరీలు (4, 6, 4, 4, 4) బాదారు. ఆ ఒక్క ఓవర్లోనే 23 రన్స్ వచ్చాయి. ప్రస్తుతం ENG స్కోర్ 169/5గా ఉంది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ 6 ఓవర్లలోనే 43 రన్స్ సమర్పించుకున్నారు.