News March 10, 2025

జనగామ: స్పోర్ట్స్ గ్రాంట్ నిధులు మంజూరు

image

పాఠశాలల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా జనగామ జిల్లాలోని 450 పాఠశాలకు రూ.48,25,000 నిధులను విడుదల చేసింది. ఈమేరకు ఆయా పాఠశాలలకు సంబంధించిన ఖాతాల్లోకి నిధులు జమ చేసింది. వచ్చిన నిధులతో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యం ఆట వస్తువులు కొనుగోలు చేస్తున్నారు.

Similar News

News September 17, 2025

NZB: జాతీయ పతాకాన్ని ఎగరవేసిన CM సలహాదారు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజా వ్యవహారాలు) వేం నరేందర్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రగతిని వివరించారు. కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, CP సాయి చైతన్య, MLAలు భూపతి రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

News September 17, 2025

వీరుల త్యాగానికి సాక్షిగా పాలకుర్తి!

image

తెలంగాణ ప్రజాస్వామ్య పోరాట కేంద్రంగా పాలకుర్తి పేరొందింది. చాకలి ఐలమ్మ, చౌదవరపు విశ్వనాధం వంటి వీరులు దొరల పాలన, నిజాం సవరణకు వ్యతిరేకంగా పోరాడి ఈ ప్రాంతానికి చరిత్రాత్మక ఘట్టాలు అందించారు. గూడూరు గ్రామం 20 మంది స్వాతంత్ర్య సమరయోధులను అందించింది. వీరి త్యాగాలు, సమర్పణలు పాలకుర్తిని ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిపాయి.

News September 17, 2025

తెలంగాణ చరిత్రను BJP వ్యతిరేకిస్తోంది: కవిత

image

తెలంగాణ జాగృతి కార్యాలయంలో SEP 17 తెలంగాణ విలీన దినోత్సవమేనని కవిత అన్నారు. తెలంగాణ చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని, మతవిద్వేషాలను రెచ్చగొడుతోందన్నారు. తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని కవిత అన్నారు. మోదీపై ప్రేమ లేకపోతే ఆ పార్టీ దుష్ప్రచారం ఆపాలని.. కేంద్రానికి సీఎం రేవంత్ లేఖ రాయాలన్నారు.