News March 10, 2025

ASF: పురుగుమందు తాగి ఆత్మహత్య

image

చింతలమానేపల్లి మండలం బూరేపల్లి గ్రామానికి చెందిన బాసనబోయిన తిరుపతి (32) ఆదివారం పురుగుమందు తాగి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులకు సమాచారం అందించినట్లు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 8, 2026

IT కారిడార్‌లో అర్ధరాత్రి బేఫికర్!

image

ఆఫీసు నుంచి ఆలస్యంగా వచ్చే టెక్కీలైనా, రాత్రివేళ నడిచే సామాన్యులైనా చీకటి గల్లీల్లో అడుగు వేయాలంటే భయం. ఈ భయాన్ని పోగొట్టడానికే శేరిలింగంపల్లిలో రూ.50 కోట్లతో జీహెచ్‌ఎంసీ కొత్త వెలుగులు నింపుతోంది. కేవలం లైట్లు వేయడమే కాదు.. అవి ఐదేళ్ల పాటు వెలిగేలా గ్యారెంటీ బాధ్యత కూడా కాంట్రాక్టరుదేనని అధికారులు తెలిపారు. దీంతో మన రోడ్లపై రాత్రిపూట కూడా సురక్షితంగా, ధీమాగా తిరిగే భరోసా లభిస్తుంది.

WNP: చైనా మాంజాను విక్రయిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

వనపర్తి జిల్లా పరిధిలో చైనా మాంజాను పూర్తిగా నిషేధించినట్లు జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఉల్లంఘిస్తూ చైనా మాంజాను విక్రయించినా, వినియోగించినా లేదా దానివల్ల ఎవరికైనా ప్రమాదం సంభవించినట్లయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్రాంతి దృష్టిలో ఉంచుకొని జిల్లావ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామన్నారు.