News March 10, 2025
పి4 సర్వే సర్వేను వేగవంతం చేయాలి.. జిల్లా కలెక్టర్

పీఫోర్ సర్వే సమర్థవంతంగా నిర్వహించడంతో సామాన్యుల జీవన ప్రమాణాలు పెరుగుతాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఆదివారం ఆకివీడులో జరుగుతున్న బిఫోర్ సర్వేను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత యువతను ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఎటువంటి లోపాలు లేకుండా సర్వేను పూర్తి చేయాలని ఆమె సిబ్బందికి దిశా నిర్దేశించారు.
Similar News
News March 10, 2025
P24 సర్వే శ్రద్ద పెట్టి చేయాలి: జిల్లా కలెక్టర్

ఆకివీడులో జరుగుతున్న P4 సర్వేను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో P4 సర్వే నిర్వహిస్తున్నామన్నారు. సర్వే చేసేటప్పుడు శ్రద్ధ పెట్టి చేయాలని, ఎలాంటి తప్పులు ఉండకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, వార్డు సచివాలయ అధికారి దాసిరెడ్డి పాల్గొన్నారు
News March 10, 2025
భీమవరంలో నలుగురు క్రికెట్ బుకీలు అరెస్ట్

భారత్ -న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగింది. భీమవరం పట్టణంలోని నరసయ్య అగ్రహారానికి చెందిన కొందరు యువకులు దీనిపై క్రికెట్ బుకింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు వన్ టౌన్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 10, 2025
ప.గో: సంజయ్ దత్‌ను కలిసిన రఘురామ

ఏఎంఆర్ సంస్థ ఛైర్మన్ మహేశ్ రెడ్డి కుమారుడు దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కుమార్తె రిసెప్షన్ హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పాల్గొని నూతన వధువరులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ రిసెప్షన్లో తన పాత మిత్రుడు సంజయ్ దత్‌ను కలిశారు.