News March 10, 2025

సంగారెడ్డి: ప్రణాళికతో చదివితే మంచి మార్కులు

image

పదవ తరగతి విద్యార్థులు ప్రణాళికతో చదివితే మంచి మార్కులు వస్తాయని ఎస్టీవో శారద అన్నారు. సంగారెడ్డిలోని సాంఘిక సంక్షేమ విద్యార్థులకు అవగాహన సదస్సు ఆదివారం నిర్వహించారు. పరీక్షలు రాసే విధానం పరీక్షలకు, ఎలా సిద్ధం కావాలో తదితర అంశాల గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారులు రమేష్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Similar News

News September 19, 2025

కోటబొమ్మాళి: రైలు ప్రమాదంలో ఒకరు మృతి

image

కోటబొమ్మాళి మండలం హరిచంద్రపురం రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జిఆర్పీ హెడ్ కానిస్టేబుల్ మెట్ట సోమేశ్వరరావు శుక్రవారం తెలిపారు. మృతుడికి సుమారు 50 ఏళ్లు ఉంటాయన్నారు. వివరాలు తెలిసిన వారు పలాస జీఆర్పీ స్టేషన్‌‌‌కు తెలపాలన్నారు. 9492250069 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.

News September 19, 2025

నెల్లూరు: రష్యాలో శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

image

రష్యాలో నైపుణ్యాభివృద్ధిపై శిక్షణకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అధికారి అబ్దుల్ కయ్యం ఓ ప్రకటనలో తెలిపారు. ఆరు నెలల పాటు శిక్షణ అందిస్తారని, భోజన వసతితో పాటు స్కాలర్షిప్ అందజేస్తామన్నారు. 18 నుంచి 20 ఏళ్ల వయస్సు కలిగి 75% ఇంగ్లీషులో మార్కులు సాధించిన అభ్యర్థులు ఈనెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News September 19, 2025

విజయవాడ: క్షేత్రస్థాయిలో క‌లెక్ట‌ర్ ప‌ర్య‌ట‌న‌

image

దసరా మహోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాల ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా శుక్రవారం ఆయన క్షేత్రస్థాయిలో కాలినడకన పర్యటించి పరిశీలించారు. ఈ ఏడాది భక్తులకు మధురానుభూతులను మిగిల్చేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.