News March 10, 2025
నేడు అనంత కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. నేటి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరవుతారన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News April 2, 2026
ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి: కలెక్టర్

ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. అనంతపురంలోని DPMU కార్యాలయంలో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రకృతి వ్యవసాయ టీవోటీ శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. పీడీఎంఎస్‌ను జిల్లాలో ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ప్రకృతి వ్యవసాయంలో వినూత్న మోడల్స్ జిల్లా ద్వారా మన దేశంతో పాటు ప్రపంచ దేశాలకు ఆదర్శం అవ్వడం గర్వకారణం అని అన్నారు.
News April 2, 2026
అమరావతి చట్టబద్ధతను జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు: టీసీ వరుణ్

అమరావతికి పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించడాన్ని మాజీ సీఎం జగన్ జీర్ణించుకోలేక నిప్పులు కక్కుతున్నారని అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్ మండిపడ్డారు. పబ్జీ గేమ్ స్ఫూర్తితో రాజధానిపై వ్యాఖ్యలు చేస్తూ నవ్వులపాలవుతున్నారని ఎద్దేవా చేశారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పటిష్ఠ నాయకత్వంలోనే రాజధాని అజేయంగా నిలిచిందన్నారు. దీనికి మద్దతు తెలిపిన పార్టీలకు జనసేన తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
News April 2, 2026
అనంతపురం ఇక నుంచి 62 డివిజన్లు

50 డివిజన్లకు పరిమితమైన అనంతపురం నగరపాలక సంస్థకు మరో 12 డివిజన్లు అదనంగా పెంచారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 62 డివిజన్లుగా మార్పు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ సందర్భంగా కార్పొరేటర్ కావాలనుకుంటున్న అన్ని రాజకీయ పార్టీలోని ఆశావాహులకు ఇదో చక్కటి అవకాశంగా పలువురు అభివర్ణిస్తున్నారు.


