News March 10, 2025
రాయచోటి: కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

రాయచోటి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదివారం తెలిపారు. అర్జీదారులు తమ విజ్ఞప్తులను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాగలరని తెలిపారు.
Similar News
News March 10, 2025
పార్వతీపురం: 372 మంది విద్యార్థులు గైర్హాజరు

ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 372 గైర్హాజరు అయినట్లు DVEO మంజులా వీణ తెలిపారు. పార్వతీపురం జిల్లావ్యాప్తంగా సోమవారం 34 పరీక్ష కేంద్రాల్లో 7,880 మంది విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉండగా 7,508 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 4,954 మంది జనరల్ విద్యార్థులకు గాను 4,812 మంది విద్యార్థులు హాజరుయ్యారు. 2,926 ఒకేషనల్ విద్యార్థులకు గాను 2,696 మంది హాజరయ్యారని పేర్కొన్నారు.
News March 10, 2025
శ్రీకాళహస్తిలో ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ వేడుక?

హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కన్నప్ప’. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక శ్రీకాళహస్తిలో జరగనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఈ విషయాన్ని త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాటు స్టార్ నటులందరినీ ఈ వేడుకకు తీసుకొచ్చేందుకు విష్ణు ప్రయత్నిస్తున్నారట. ఈ చిత్రంలో కన్నప్పగా మంచు విష్ణు నటిస్తుండగా.. నందీశ్వరుడిగా ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే.
News March 10, 2025
సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదం.. 12 మందికి గాయాలు

సత్తుపల్లి మండలంలో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి శివారులోని తామర చెరువు వద్ద కాకర్లపల్లి నుంచి వెళుతున్న కూలీల ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 12 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.