News March 10, 2025

నల్గొండ: ఎమ్మెల్సీ సీపీఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం

image

శాసనమండలి ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం పేరు ఖారారైంది. హైదరాబాద్‌ మఖ్దూం భవన్‌లో ఆదివారం జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. నెల్లికంటి సత్యం సోమవారం ఉదయం 10గంటలకు నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నెల్లికంటి సత్యం NLG జిల్లా సీపీఐ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Similar News

News March 21, 2026

NLG: సాగునీటి వివక్షపై సీపీఐ పోరు!

image

జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న అన్యాయంపై సీపీఐ సమరశంఖం పూరించింది. ముఖ్యంగా డిండి ప్రాజెక్టు నిర్మాణంలో ప్రదర్శిస్తున్న వివక్షను ఎండగడుతూ భారీ ఉద్యమాలకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ అన్యాయాన్ని నిరసిస్తూ ఏప్రిల్ 1, 2 తేదీలలో బీసీ టన్నెల్, ఏదుల రిజర్వాయర్ ప్రాజెక్టులను సీపీఐ బృందం సందర్శించి వాస్తవాలను పరిశీలించనుంది. ఏప్రిల్ 5న అఖిలపక్ష సదస్సును నిర్వహించనున్నారు.

News March 21, 2026

NLG: ముగింపు దశలో మొలకెత్తిన ఆశ!

image

జిల్లాలోని అన్నదాతల నిరీక్షణకు తెరపడనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’ నిధులు రేపటి నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. యాసంగి సీజన్ ముగింపు దశకు వస్తున్న తరుణంలో, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతాంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జిల్లాలో ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో 5.56 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. సాగు కోసం అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్న రైతులకు ఊరట కలగనుంది.

News March 21, 2026

నల్గొండ జీజీహెచ్‌లో వేధింపుల కలకలం..!

image

నల్గొండ జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రక్షణ కరువైంది. ఎక్స్‌రే విభాగంలో శిక్షణ పొందుతున్న ఓ పారామెడికల్ విద్యార్థినిపై అక్కడే అవుట్‌సోర్సింగ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న వ్యక్తి గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు తెగబడుతున్నాడు. నిందితుడి వేధింపులు మితిమీరడంతో భరించలేకపోయిన బాధితురాలు శనివారం ‘డయల్ 100’కు ఫిర్యాదు చేసింది.