News March 23, 2024

విజయవాడ: సమాచార శాఖలో ఇకపై వారి సేవలకు సెలవు

image

రాష్ట్ర సమాచార శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను ఉపసంహరించుకున్నట్లు ఆ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పెద్ద ఎత్తున తమ సానుభూతిపరులను సమాచార శాఖలోకి తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వీరందరినీ విధుల నుంచి తొలగిస్తూ సర్క్యులర్ మెమో నంబర్. 4539/అడ్మిన్-1-1/2019ను జారీ చేశారు.

Similar News

News September 7, 2025

మచిలీపట్నంలో చికెన్ ధర ఎంతంటే?

image

మచిలీపట్నంలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్ లెస్ కేజీ రూ.220, స్కిన్‌తో అయితే రూ.200కి లభిస్తోంది. కొన్ని చోట్ల డిమాండ్‌ను బట్టి ధరల్లో స్వల్ప మార్పులున్నాయి. మటన్ ధర యథావిధిగా రూ.800 -1000 మధ్య కొనసాగుతుంది. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News September 6, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ కృష్ణా: ఈనెల 10న షూటింగ్ బాల్ జట్లు ఎంపిక
☞ ఆత్కూరులో యువతతో ముచ్చటించిన వెంకయ్య నాయుడు
☞ రైతుల్లో నమ్మకం పెంచేందుకు కృషి చేయండి: కలెక్టర్
☞ జాతీయ అవార్డులు అందుకున్న కృష్ణాజిల్లా ఉపాధ్యాయులు
☞ కృష్ణా: తగ్గుముఖం పట్టిన వరద
☞ చల్లపల్లి: నదిలో మునిగి యువకుడి మృతి

News September 6, 2025

కృష్ణా: ఈనెల 10న షూటింగ్ బాల్ జట్ల ఎంపికలు

image

కృష్ణాజిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాల బాలికల జిల్లా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంఘం అధ్యక్షులు రాజశేఖర్ తెలిపారు. ఈ ఎంపికలు ఈనెల 10న మధ్యాహ్నం 2 గంటలకు గుణదలలో జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు తమ ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావచ్చన్నారు. ఎంపికైన క్రీడాకారులు నెల్లూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు.