News March 10, 2025

ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల

image

TG: బీఎడ్‌లో ప్రవేశాలకు సంబంధించి ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1న ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. ఎల్లుండి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా మే 24వరకు లేట్ ఫీజుతో స్వీకరిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.550, మిగతావారు రూ.750 ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.
వెబ్‌సైట్: https://edcet.tgche.ac.in

Similar News

News March 12, 2026

అక్షర్‌ పటే‌ల్‌కు సారీ చెప్పిన కెప్టెన్ సూర్య

image

అక్షర్‌ పటే‌ల్‌కు కెప్టెన్ సూర్యకుమార్ సారీ చెప్పారు. T20 WC S-8లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతణ్ని తీసుకోకపోవడం తప్పేనని అంగీకరించారు. దీనిపై అక్షర్ కోపం వ్యక్తం చేశారని.. దాంట్లో తప్పులేదని అభిప్రాయపడ్డారు. గ్రూప్ స్టేజ్‌లో చివర నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయం కారణంగా అక్షర్ ఆడలేదు. దీంతో SAతో మ్యాచ్‌లో వాషింగ్టన్‌ను సెలక్ట్ చేశారు. దాంట్లో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది.

News March 12, 2026

ఇరాన్ కండీషన్స్‌ అమలు సాధ్యమేనా?

image

యుద్ధం ఆపడానికి ఇరాన్ పెట్టిన <<19359163>>కండీషన్స్<<>> నెరవేరడం సాధ్యమేనా అనే చర్చ జరుగుతోంది. ఇరాన్‌లో పాలన మార్పు, అణు సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్/US యుద్ధాన్ని ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ హక్కులను గుర్తిస్తూ భద్రతకు హామీ ఇవ్వడం జరిగే పనికాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నష్టపరిహారం ఇవ్వడానికీ అగ్రరాజ్యం ఒప్పుకోదంటున్నారు. దీంతో యుద్ధం మరింత కాలం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

News March 12, 2026

కవిత ఇంటికి సీబీఐ అధికారులు

image

TG: మాజీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చేందుకు సీబీఐ అధికారులు హైదరాబాద్‌లోని ఆమె ఇంటికి వచ్చారు. భర్త అనిల్ నోటీసులు తీసుకున్నారు. లిక్కర్ కేసులో ఇటీవల ఆమెకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సీబీఐ హైకోర్టులో సవాల్ చేసింది. కాగా, న్యాయస్థానం నోటీసులను నేడు అధికారులు ఆమెకు అందజేశారు. 16న విచారణకు హాజరు కావాలని తెలిపారు.