News March 10, 2025
NGKL: గురు ప్రీత్ సింగ్ కుటుంబ నేపథ్యం ఇదే..!

SLBC టన్నెల్ ప్రమాదంలో మృతి చెంది 16 రోజులకు మృతదేహంగా బయటపడిన గురు ప్రీత్ సింగ్(40) కుటుంబ నేపథ్యం ఇదే. వీరిది పంజాబ్‌లోని చీమ కలన్ గ్రామంలో 1985లో జన్మించారు. తండ్రి విర్స సింగ్, ఎరెక్టర్ ఆపరేటర్‌గా పనిచేసేవారు. అమెరికాకు చెందిన రాబిన్స్ కంపెనీలో 2022లో రెగ్యులర్ ఉద్యోగిగా చేరారు. భార్య రాజ్విందర్ కౌర్ ఉన్నారు. ఆయన మృతదేహం బయటకు తేవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగారు.
Similar News
News March 15, 2026
కార్మికులంతా విధిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి: కలెక్టర్

జనగామ మండలం గానుగుపహాడ్ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారు. కార్మికులకు నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, ఆరోగ్య సేవలను స్వయంగా సమీక్షించారు. అనారోగ్య లక్షణాలున్న వారికి తక్షణమే మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. కార్మికులంతా విధిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News March 15, 2026
బెల్లంపల్లి: మరణించినా.. సజీవం ఆ కళ్లు

బెల్లంపల్లి కాల్‌టెక్స్ ఏరియాకు చెందిన పాన్ షాపు యజమాని కొట్టే సత్యప్రకాశ్(68) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణానంతరం కుటుంబ సభ్యులు నేత్రదానానికి ముందుకు వచ్చారు. ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంకు సిబ్బంది సత్యప్రకాశ్ కళ్లను సేకరించారు. శోకసంద్రంలోనూ నేత్రదానం చేసి ఇద్దరికి చూపునిచ్చిన ఆ కుటుంబాన్ని ఐ బ్యాంకు నిర్వాహకులు, స్థానికులు అభినందించారు.
News March 15, 2026
సంగారెడ్డి: రేపటి నుంచి ఒంటి పూట బడి

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈనెల 16 నుంచి ఒంటి పూట బాటలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు తరగతులు నిర్వహించాలని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా రెండు పూటలా పాఠశాల నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


