News March 10, 2025

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

image

నేటి నుంచి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మణిపుర్, వక్ఫ్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన తదితర అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ చర్చ జరిగే అవకాశముంది. మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం లోక్‌సభ ఆమోదం కోరే అవకాశముంది. మొదటి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగిన సంగతి తెలిసిందే. రెండో విడత ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి.

Similar News

News March 10, 2025

కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు: KTR

image

TG: ఈనెల 12 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలకు BRS అధినేత KCR హాజరవుతారని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘బడ్జెట్ ప్రసంగంలో కేసీఆర్ పాల్గొంటారు. ఆయన వచ్చి కాంగ్రెస్ నేతల అబద్ధాలు, దూషణలు పడాలా? ఇలాంటి నేతలున్న సభకు ఆయన రావాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. వీరి స్థాయికి మేం చాలు. ఆయన అవసరం లేదు’ అని తెలిపారు. ఈనెల 16 తర్వాత ఫార్ములా ఈ-రేసు కేసులో తనను మళ్లీ విచారణకు పిలుస్తారని పేర్కొన్నారు.

News March 10, 2025

చంద్రయ్య హత్య కేసు CIDకి అప్పగింత

image

AP: పల్నాడుకు చెందిన TDP కార్యకర్త తోట చంద్రయ్య హత్య కేసును CIDకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేసు దస్త్రాన్ని వెంటనే పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. 2022లో వెల్దుర్తి (M) గుండ్లపాడులో ప్రత్యర్థులు చంద్రయ్యను గొంతు కోసి చంపారు. హత్యకు ముందు జై జగన్ అనాలని నిందితులు చంద్రయ్యను బెదిరించారనే ఆరోపణలున్నాయి. కేసు రీఓపెన్ చేయాలని తొలుత భావించిన ప్రభుత్వం తాజాగా CIDకి అప్పగించింది.

News March 10, 2025

ఎన్టీఆర్-నెల్సన్ సినిమా టైటిల్ అదేనా?

image

తమిళ డైరెక్టర్ నెల్సన్‌తో Jr.NTR ఓ సినిమా చేయబోతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరి కాంబోలో మూవీ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ కూడా చాలా ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయని, దీనికి ‘ROCK’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘డ్రాగన్’తో ఎన్టీఆర్, ‘జైలర్-2’తో నెల్సన్ బిజీగా ఉన్నారు.

error: Content is protected !!