News March 10, 2025
పార్వతీపురం: దరఖాస్తుల ఆహ్వానం

సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎన్ తిరుపతి నాయుడు తెలిపారు. జిల్లాలో 15 మండలాల ZPHS, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హత గల ఉపాధ్యాయులు 12వ తేదీలోగా డీఈఓ కార్యాలయానికి వివరాలు తెలియజేయాలన్నారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News March 12, 2026
శ్రీకాకుళం: ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో ఆరుగురు డిబార్

శ్రీకాకుళం జిల్లాలోని ఆరు కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం స్క్వాడ్ పరిశీలనలో కాపీయింగ్ చేస్తున్న ఆరుగురిని డిబార్ చేసినట్లు డీఈవో ఎ.రవి బాబు చెప్పారు. 866 మంది విద్యార్థులకు 755 మంది హాజరు కాగా 111 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణను సిట్టింగ్ స్క్వాడ్లు పర్యవేక్షిస్తున్నాయననారు.
News March 12, 2026
ఉగాది రోజు ఇలా చేయకండి: పండితులు

ఉగాది రోజున తప్పక పాటించాల్సిన నియమాలను పండితులు సూచిస్తున్నారు. ‘ఈ పర్వదినాన మాంసం ముట్టకూడదు. శాకాహారమే భుజించాలి. ఎవరిపై కోప్పడొద్దు. కన్నీరు పెట్టుకోకూడదు. ఈరోజుతో ఏడాది మొదలు కాబట్టి నవ్వుతూ ఉండాలి. ఇల్లు శుభ్రంగా ఉంచాలి. లేకుంటే దరిద్రం. అలాగే ఆరోజు ఎవరికీ అప్పు ఇవ్వొద్దు. ఇస్తే ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని తాగకుండా అస్సలు ఉండొద్దు’ అని చెబుతున్నారు.
News March 12, 2026
HYD: జనాభా గణనపై BIG UPDATE

జనాభా గణన- 2027ను గ్రేటర్ వ్యాప్తంగా పకడ్బందీగా చేపట్టి, డూప్లికేషన్ లేకుండా చూడాలని రాష్ట్ర సెన్సెస్ డైరెక్టర్ భారతి హోళికేరి అన్నారు. GHMC హెడ్ ఆఫీస్‌లో సెన్సెస్ సర్వేపై ఛార్జీ సెన్సెస్ ఆఫీసర్లు, అదనపు ఛార్జీ సెన్సెస్ ఆఫీసర్లకు 3 రోజుల శిక్షణను ప్రారంభించి మాట్లాడారు. సర్వే 2 దశల్లో జరుగుతుందని మొదటి దశలో గృహ గణన, రెండో దశలో జనాభా గణన ఉంటుందన్నారు.


