News March 10, 2025
కొలిమిగుండ్ల సీఐపై YCP సంచలన ఆరోపణలు

కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లెలో YCP సానుభూతిపరుల చీనీ తోటను టీడీపీ వర్గీయులు జేసీబీతో ధ్వంసం చేయడం, దాడికి పాల్పడటంపై వైసీపీ మండిపడింది. ‘చీనీ తోట సాగు చేసిన భూమిపై కోర్టులో వ్యాజ్యం కొనసాగుతుండగా.. సీఐ రమేశ్ బాబు ఈ కేసులో జోక్యం చేసుకున్నారు. ఆ భూమిని TDP వారికి స్వాధీనం చేయాలంటూ మూడు రోజుల నుంచి సీఐ ఒత్తిడి తెస్తున్నారు’ అంటూ YCP సంచలన ఆరోపణలు చేసింది.
Similar News
News September 16, 2025
విజయవాడ: ఉప్మా దోశ విషయంలో దాడి.. నిందితుడు అరెస్ట్

విజయవాడ శివారు జక్కంపూడిలోని ఓ హోటల్‌లో ఉప్మా దోశ ఆర్డర్ విషయంలో ఆదివారం గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హోటల్ సప్లయర్ పోలిశెట్టి రాజు కస్టమర్ కరిముల్లాపై చాకుతో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు అయినట్లు కొత్తపేట సీఐ కొండలరావు తెలిపారు. రాజుని అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.
News September 16, 2025
గరుగుబిల్లి: రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి

గరుగుబిల్లి మండలం నందివానవలస కోళ్లు ఫారం వద్ద సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో గిజబ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ మరాడన ఆదినారాయణ మృతి చెందాడు. ఖడ్గవలస నుంచి రాత్రి 10 గంటల సమయంలో స్వగ్రామం గిజబకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఓ వాహనం ఢీకొనడంతో ఆదినారాయణ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై ఎస్‌ఐ ఫక్రుద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 16, 2025
హైవేల వల్ల భూములు విలువ పెరుగుతుంది: కలెక్టర్

గ్రీన్ ఫీల్డ్ హైవేకు సంబంధించిన రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌లతో కలిసి దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే భూ సేకరణ సమస్యపై రైతులతో సమావేశం నిర్వహించారు. రైతులకు అన్యాయం చేయాలని ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, హైవే రావడం వల్ల భూముల విలువ పెరుగుతుందన్నారు.