News March 10, 2025
అనాతవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ముమ్మిడివరం మండలం అనాతవరం సమీపంలో 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ఆబోతును ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి ఘటనా స్థలంలో మృతి చెందాడు. వెనక కూర్చున్న వ్యక్తికి గాయాలయ్యాయి. కాకినాడ నుంచి భీమవరం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 6, 2025
వర్షంలో తడుస్తున్నారా?

కొందరు వర్షంలో తడుసుకుంటూ ఇంటికి వచ్చి యథావిధిగా పనులు చేసుకుంటుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తడిసిన వెంటనే దుస్తులు మార్చుకుంటే శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకుంటుంది. దీనివల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్ కారకాల నుంచి తప్పించుకోవచ్చు. శరీరంపై యాంటీ బాక్టీరియల్ క్రీమ్ రాసుకోవాలి. టీ లేదా కషాయాలు తాగాలి. ఇలా చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
News July 6, 2025
రాజీవ్ యువ వికాసానికి యువత ఎదురుచూపులు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంకై గద్వాల జిల్లాలోని నిరుద్యోగ యువత ఆశగా ఎదురుచూస్తున్నారు. దరఖాస్తులు సమర్పించి నెలలు గడుస్తున్నా.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రాయితీ రుణాలతో స్వయం ఉపాధి పొందుదామనుకున్న యువత నిరాశకు గురవుతున్నారు. రాజీవ్ యువ వికాసం పథకంను ప్రభుత్వం త్వరగా అమలు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు కోరుతున్నారు.
News July 6, 2025
NLG: ‘భూభారతి.. ఎలాంటి ఓటీపీలు అడగడం జరగదు’

భూ సమస్యల పరిష్కార విషయంలో ప్రభుత్వం రైతులను ఎలాంటి ఓటీపీ అడగడం జరగదని, అసలు ఓటీపీ సమస్యే రాదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. Way2News ఇవాళ ప్రచురితమైన వార్తకు కలెక్టర్ స్పందించారు. తహశీల్దార్ స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ వివరించారు. అందువల్ల రైతులు ఎవరు ఈ విషయాలను నమ్మవద్దని ఆమె స్పష్టం చేశారు.