News March 10, 2025

నామినేషన్లకు నేడే ఆఖరు..

image

TG: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికలకు నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ రావు, కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రావణ్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం నామినేషన్లు వేయనున్నారు. ఈ నెల 13న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు కాగా 20న పోలింగ్ జరగనుంది. అదే రోజున ఈసీ లెక్కింపు నిర్వహించనుంది.

Similar News

News April 4, 2026

15వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్!

image

త్వరలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) CGL-2026 నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. దాదాపు 15వేల అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్), ఎస్సై, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ తదితర గ్రూప్-B, C పోస్టులు ఉన్నాయి. దీనికి డిగ్రీ అర్హత ఉండాలి. నోటిఫికేషన్ విడుదల అయ్యాక దరఖాస్తు తేదీలు వెల్లడించనున్నారు.

News April 4, 2026

ప్రేమ విఫలమై పెళ్లి నిరాకరిస్తే నేరం కాదు: హైకోర్టు

image

తెలంగాణ హైకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. ప్రేమించి ఆ పిదప పెళ్లికి నిరాకరించడం అన్ని సందర్భాల్లోనూ నేరం/మోసం కిందకు రాదని, కేవలం వాగ్దాన ఉల్లంఘన మాత్రమేనని స్పష్టం చేసింది. పెద్దపల్లి జిల్లా పొట్యాలకు చెందిన సంతోష్ ఓ యువతితో ఐదేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. తర్వాత పెళ్లి చేసుకోలేదనే కారణంతో ఆమె అతనిపై కేసు పెట్టింది. దీనిపై సంతోష్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు కేసును కొట్టేసింది.

News April 4, 2026

GK: జన్యు సంబంధ వ్యాధులు.. లక్షణాలు

image

✒ తలసీమియా: హిమోగ్లోబిన్ తగ్గి రక్తహీనతకు దారి తీస్తుంది.
✒ కలర్ బ్లైండ్‌నెస్: ఎరుపు, ఆకుపచ్చ రంగులను గుర్తించలేరు.
✒ సికిల్‌సెల్ ఎనీమియా: రక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారి రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. నొప్పి, ఇన్ఫెక్షన్లు, ఆర్గాన్ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది.
✒ ఆల్బినిజం: చర్మం, జుట్టు, కళ్లకు రంగునిచ్చే మెలనిన్ లోపిస్తుంది. దీనివల్ల చర్మం, జుట్టు తెల్లరంగులోకి మారతాయి. కంటిచూపు సమస్యలొస్తాయి.