News March 10, 2025
జుక్కల్‌కు రూ.200 కోట్లు

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గానికి రూ.200 కోట్లు మంజూరయ్యాయి.
Similar News
News March 10, 2025
అనంతగిరి: కుక్కల దాడిలో జింక మృతి

వీధి కుక్కల వేటలో జింక (దుప్పి ) మృతిచెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవిలో వీధి కుక్కల వేటలో జింక మృతి(దుప్పి ) చెందిందని స్థానికులు తెలిపారు. ఉదయం గుంపుగా వచ్చిన కుక్కలు మూగజీవాలపై విరుచుకుపడ్డాయని చెప్పారు.
News March 10, 2025
చంద్రయ్య హత్య కేసు CIDకి అప్పగింత

AP: పల్నాడుకు చెందిన TDP కార్యకర్త తోట చంద్రయ్య హత్య కేసును CIDకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేసు దస్త్రాన్ని వెంటనే పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. 2022లో వెల్దుర్తి (M) గుండ్లపాడులో ప్రత్యర్థులు చంద్రయ్యను గొంతు కోసి చంపారు. హత్యకు ముందు జై జగన్ అనాలని నిందితులు చంద్రయ్యను బెదిరించారనే ఆరోపణలున్నాయి. కేసు రీఓపెన్ చేయాలని తొలుత భావించిన ప్రభుత్వం తాజాగా CIDకి అప్పగించింది.
News March 10, 2025
ఏలూరు: వారం వ్యవధిలో రెండు ప్రమాదాలు

ఏలూరు జిల్లాలో వారం రోజుల వ్యవధిలో రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలకు గురయ్యారు. వైజాగ్, హైదరాబాద్, చెన్నై తదితర సర్వీసులకు ఏలూరు సెంటర్ పాయింట్‌గా ఉంది. సుదూర ప్రాంతాలకు ట్రావెల్ చేసే ఈ బస్సుల్లో డ్రైవర్లు ఒక్కరే ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏకధాటిగా గంటల తరబడి డ్రైవింగ్ చేయడం, నిద్రలేమి కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.