News March 23, 2024

ఉమ్మడి వరంగల్‌లో వరుస ACB దాడులు

image

ACB దాడులతో ఉమ్మడి WGL జిల్లాలోని అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే 4 కేసులు నమోదయ్యాయి. లంచం తీసుకుంటుండగా ముగ్గురు అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడగా.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తహశీల్దారును అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు, తొలిసారిగా KUలో ఉద్యోగిని పట్టుకున్నారు. శుక్రవారం MHBD జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ తస్లీమా లంచం తీసుకుంటూ దొరికిన విషయం తెలిసిందే.

Similar News

News September 9, 2025

వరంగల్: 136 ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్

image

జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద జిల్లా ప్రజల నుంచి 136 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ సమస్యలు 60, జీడబ్ల్యూఎంసీ 21, విద్యాశాఖ 11, సహకార శాఖ 9, గృహ నిర్మాణ శాఖ 7, ఇతర శాఖలకు 28 ఫిర్యాదులు వచ్చాయి. ప్రతి ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

News September 8, 2025

వరంగల్: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వినతుల స్వీకరణ

image

వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలపై వినతులను కలెక్టర్‌కు నేరుగా అందజేశారు. డాక్టర్ సత్య శారద ప్రతి వినతిని ఓర్పుతో స్వీకరించి, సంబంధిత అధికారులకు వెంటనే సూచనలు చేశారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ స్పష్టం చేశారు.

News September 8, 2025

వరంగల్: ‘తుది ఓటరు జాబితా రూపకల్పనలో సహకరించాలి’

image

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద నేతృత్వంలో ఈరోజు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితా రూపకల్పనలో ప్రతి పార్టీ సమన్వయం చేసి సహకరించాలని కలెక్టర్ కోరారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా సాగేందుకు ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె సూచించారు.