News March 10, 2025
నల్గొండ: టీమ్ ఇండియా క్రీడాకారులకు మంత్రి కోమటిరెడ్డి విషెస్

అద్భుతమైన ఆట తీరుతో, అప్రతిహత విజయాలతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 నెగ్గిన భారత క్రికెట్ జట్టుకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం భారత క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ టోర్నీలో, టీమిండియా విజయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు పలువురు క్రీడాకారులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
Similar News
News March 22, 2026
అన్నదాతలకు అన్నగా బాధ్యత తీసుకున్నా: CM రేవంత్

TG: రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నామని CM రేవంత్ తెలిపారు. అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నానన్నారు. ‘70L మందికి ₹9,000Cr రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నాం. మా పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ సిద్దిపేట(D) నర్మెట్ట గ్రామ వేదికగా పథకాన్ని అమలు చేస్తున్నాం. అక్కడ పామాయిల్ పరిశ్రమ, రిఫైనరీ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.
News March 22, 2026
అమెరికా దాడుల్లో 20 రోజుల పాప మృతి!

అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్‌లోని ఖజ్విన్‌కు చెందిన 20 రోజుల పాప చనిపోయినట్లు ఇరానియన్ మీడియా సంస్థ ‘ఫార్స్ న్యూస్’ పేర్కొంది. US-అమెరికా దాడులు ప్రారంభించినప్పటి (ఫిబ్రవరి 28) నుంచి ఇప్పటివరకు ఇరాన్‌లో 1,400కి పైగా మరణాలు నమోదయ్యాయి. ఇందులో 200 మందికి పైగా పిల్లలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడించాయి. యుద్ధంలో పసి ప్రాణాలు బలవ్వడం బాధాకరమని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు.
News March 22, 2026
KMR: జల సంరక్షణకు మనము సైతం ప్రతిన బూనుదాం

కామారెడ్డి జిల్లాలో భూగర్భ జలాలు గతం కంటే మేలుగానే ఉన్నాయి. నూతనంగా జిల్లా ఏర్పడిన తర్వాత భూగర్భ జలాలను పెంచేందుకు అధికార యంత్రాంగం పటిష్ఠ చర్యలు చేపట్టింది. క్రమానుగుణంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. భూగర్భ జలాలను పెంచుకునేందుకు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికార యంత్రాంగం అవగాహనలు కల్పిస్తూనే ఉంది. జల దినోత్సవం సందర్భంగా సంరక్షణకు మనము సైతం ముందడుగు వేయాలి..!


