News March 10, 2025

వర్గల్: విషాదం.. తల్లి మందలించిందని విద్యార్థి సూసైడ్

image

తల్లి చదువుకోమని మందలించినందుకు విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. గౌరారం SI కరుణాకర్ రెడ్డి వివరాలిలా.. వర్గల్ మం. చాంద్‌ఖాన్ మక్తాకు చెందిన విజయేందర్ రెడ్డి(15) చౌదర్‌పల్లి పాఠశాలలో టెన్త్ చదువుతున్నాడు. విజయేందర్ గురువారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లగా ఎందుకు తిరుగుతున్నావని తల్లి కనకవ్వ మందలించింది. దీంతో మనస్తాపంతో పురుగు మందు తగగా చికిత్స పొందుతూ అదివారం మృతి చెందాడు.

Similar News

News December 28, 2025

వరంగల్: రేపటి నుంచే ‘యూరియా యాప్’ అమలు

image

వరంగల్ జిల్లాలో యూరియా పంపిణీని మరింత పారదర్శకం చేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. రేపటి నుంచి జిల్లావ్యాప్తంగా యూరియా యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఉన్న రైతులు గూగుల్ ప్లే స్టోర్‌లో ‘Fertilizer Booking App’ అని టైప్ చేసి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. యూరియా సరఫరాలో జాప్యాన్ని నివారించొచ్చని ఆమె పేర్కొన్నారు.

News December 28, 2025

ప్రముఖ ఫ్రెంచ్ నటి కన్నుమూత

image

ప్రముఖ ఫ్రెంచ్ నటి బ్రిగిట్టే బార్డోట్(91) మరణించారు. నటి, మోడల్‌, సింగర్‌గా ఆమెకు గుర్తింపు ఉంది. యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్‌గానూ మంచి పేరు తెచ్చుకున్నారు. సదరన్ ఫ్రాన్స్‌లోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచినట్లు ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది. మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గతనెల అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఆమె వృద్ధాప్య సమస్యలతోనే మరణించి ఉండొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

News December 28, 2025

PHOTO: వరి నాట్లు వేసిన బండారు శ్రావణి

image

శింగనమలలోని శివాలయం పరిసర ప్రాంతాలు, శ్రీరంగరాయ చెరువు ఆయకట్టు పరిధిలో కూలీలతో కలిసి ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ వరి నాట్లు వేశారు. రబీ సీజన్‌లో వరి పంటకు సాగునీటి కోసం ఆందోళన చెందుతూ రైతులు ఇటీవల ఎమ్మెల్యేను కలిశారు. వారి అభ్యర్థన మేరకు ఇవాళ పొలాలను సందర్శించి, పరిశీలించారు. సాగు పరిస్థితులు, సాగునీటి సమస్యలపై రైతులతో మాట్లాడారు. సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.