News March 10, 2025

సిద్దిపేటలో విషాదం.. తల్లి తిట్టిందని బాలుడి సూసైడ్

image

క్షణికావేశంలో ఓ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డిన ఘటన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. గౌరారం SI కరుణాకర్ రెడ్డి వివరాలిలా.. వర్గల్ మం. చాంద్‌ఖాన్ మక్తాకు చెందిన విజయేందర్ రెడ్డి(15) చౌదర్‌పల్లి పాఠశాలలో టెన్త్ చదువుతున్నాడు. విజయేందర్ గురువారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లగా ఎందుకు తిరుగుతున్నావని తల్లి కనకవ్వ మందలించింది. దీంతో మనస్తాపంతో పురుగు మందు తగగా చికిత్స పొందుతూ అదివారం మృతి చెందాడు.

Similar News

News March 10, 2025

రేపు బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం.. దిశానిర్దేశం చేయనున్న KCR

image

రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్‌ఎస్‌ సన్నద్ధమవుతుంది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్‌ ఉభయ సభల సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణభవన్‌లో మంగళవారం 1 గంటకు బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు.

News March 10, 2025

వర్గల్: పెళ్లిలో డిజిటల్ కట్నాల చదివింపులు

image

పెళ్లిలో ఇంతకాలం పెళ్లికూతురు, పెళ్లికొడుకు కట్నాల చదివింపులు రాతపూర్వకంగా ఉండేవి. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం కొత్త ట్రెండ్ మొదలైంది. అంతా డిజిటలైజేషన్ కావడంతో వర్గల్ మండలం గౌరారంలో ఆదివారం జరిగిన ఒక వివాహ వేడుకలలో పెళ్లికొడుకు, పెళ్లికూతురు తరపున చదివింపుల కార్యక్రమంలో ఫోన్‌పే స్కానర్ ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసిన స్కానర్ ద్వారా చదివింపులు చేపట్టారు.

News March 10, 2025

మెదక్: కడుపునొప్పితో వివాహిత సూసైడ్

image

కడుపునొప్పి భరించలేక వివాహిత సూసైడ్ చేసుకుంది. SI రంజిత్ రెడ్డి వివరాలిలా.. సంగారెడ్డి జిల్లా మర్పెల్లికి చెందిన మహేశ్వరి(27)కి కౌడిపల్లి మం. మహమ్మద్‌నగర్‌కు చెందిన అనిల్‌తో ఏడేళ్ల క్రితం పెళ్లైంది. కొడుకు పుట్టినప్పటి నుంచి మహేశ్వరి కడుపునొప్పితో బాధపడుతుంది. పలుచోట్ల చికిత్స చేయించినా తగ్గలేదు. మనస్తాపం చెందిన ఆమె నిన్న ఇంట్లో ఉరేసుకుంది. మహేశ్వరి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

error: Content is protected !!