News March 10, 2025

సంతమాగులూరు: మృతి చెందిన వ్యక్తి వివరాలు గుర్తింపు

image

సంతమాగులూరు మండలం వెల్లలచెరువు గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద ఆదివారం రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మృతుడి వివరాలను రైల్వే పోలీసులు గుర్తించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని బరంపేటకు చెందిన శివారెడ్డిగా గుర్తించారు. అలాగే పంచనామా అనంతరం శివారెడ్డి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.

Similar News

News November 9, 2025

జూబ్లీ బైపోల్: ఓటర్లు, పోలింగ్ బూత్‌ల వివరాలు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎల్లుండి జరగనుంది. పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో 7 డివిజన్లు ఉన్నాయి. ఓటర్ల సంఖ్య: 4,01,365. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. వీటిలో 226 సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఈ కేంద్రాల వద్ద రెండంచల భద్రత ఏర్పాటు చేస్తారు. ఉప ఎన్నికలో 58 అభ్యర్థులు(+నోటా) పోటీ చేస్తున్నారు. INC-BRS-BJP మధ్య ప్రధానంగా పోటీ కనిపిస్తోంది.

రాష్ట్రస్థాయి పోటీల్లో ఫైనల్స్‌కు చేరిన ఉమ్మడి ADB జట్టు

image

నారాయణపేట జిల్లాలో ఈనెల 7 నుంచి జరుగుతున్న తెలంగాణ రాష్ట్రస్థాయి SGF అండర్-17 హ్యాండ్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలికల జట్టు ఫైనల్స్‌కు చేరింది. వివిధ జిల్లా జట్టులతో తలపడి ప్రతిభ కనబరిచింది. నేడు జరిగే ఫైనల్స్‌కు చేరిందని ఆదిలాబాద్SGF సెక్రెటరీ తెలిపారు. క్రీడాకారులను ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ సంఘం అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు శ్యాంసుందర్ రావు, కనపర్తి రమేష్ అభినందించారు.