News March 10, 2025
ఆదిలాబాద్, నిర్మల్‌కు మొండిచేయి

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్‌కు రూ.200కోట్లు, మంచిర్యాలకు రూ.600 కోట్లు మంజూరుకాగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ఎలాంటి కేటాయింపులు చేయలేదు.
Similar News
News February 24, 2026
అమ్మాయిలకు ఉచితంగా HPV వ్యాక్సిన్!

దేశవ్యాప్తంగా 14 ఏళ్ల లోపు వయసున్న అమ్మాయిలకు HPV వ్యాక్సిన్ వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే Gardasil ఇంజెక్షన్‌ను ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇవ్వనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2027 నాటికి 2.6 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పాయి. <<19154747>>సర్వైకల్<<>> (గర్భాశయ) క్యాన్సర్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాయి.
News February 24, 2026
కామారెడ్డి: ఇన్నోవేషన్ పంచాయితీ పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

కామారెడ్డి టీజేఐసీ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన ఇన్నో వేషన్ పంచాయతీ పోస్టర్లను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు సంబంధించిన యువతను ప్రోత్సహించడానికి ఈనెల 28న ఇన్నోవేషన్ పంచాయతీ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
News February 24, 2026
పార్వతీపురం: ‘రీసర్వే, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం కావాలి’

రీసర్వే, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం కావాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్లకు తెలిపారు. మంగళవారం జరిగిన వీడియో కాన్ఫిరెన్స్‌లో కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. రీ సర్వే జరిగే గ్రామాల్లోని సర్వేయర్లు తప్పనిసరిగా సంబంధిత గ్రామంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు.


