News March 10, 2025
ఖమ్మం: కాల్వలో పడి డిగ్రీ విద్యార్థి మృతి

మున్నేటిలో పడి డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. పోలీసుల వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మొగళ్లపల్లికి చెందని మహేశ్ ఖమ్మంలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. ఈ నెల 8న స్నేహితులతో కలిసి కాల్వ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీశారు. కేసు నమోదైంది.
Similar News
News March 31, 2026
నేలకొండపల్లి బౌద్ధస్తూపాన్ని అభివృద్ధి చేయాలి: ఖమ్మం ఎంపీ

నేలకొండపల్లిలోని చారిత్రక బౌద్ధస్తూపాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కోరారు. లోక్‌సభలో 377 నిబంధన కింద ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. శాతవాహన కాలం నాటి ఈ కట్టడాన్ని ‘జాతీయ బౌద్ధ పర్యాటక సర్క్యూట్’లో చేర్చాలని డిమాండ్ చేశారు. అక్కడ మ్యూజియం ఏర్పాటుతో పాటు మౌలిక వసతులు కల్పిస్తే విదేశీ పర్యాటకుల రాక పెరుగుతుందని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.

ఖమ్మం: ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తుల గడువు పొడిగింపు

ఖమ్మం జిల్లాలోని ఎస్సీ అభ్యర్థులకు శుభవార్త. ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 పథకాల ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఏప్రిల్ 8 వరకు పొడిగించినట్లు ఈడీ నవీన్ బాబు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు tsobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని, ఆ పత్రాలను సంబంధిత ఎంపీడీవో లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాలని కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ఆర్థిక మద్దతు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.