News March 10, 2025
బీటీ నాయుడికు మరో ఛాన్స్.. కారణాలివే!

కర్నూలు జిల్లా టీడీపీ నేత <<15705127>>BT<<>> నాయుడుకు మరోసారి ఎమ్మెల్సీగా ఛాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. CM చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు నమ్మకస్తుడిగా ఉండటమే ఆయనను రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేర్చిందని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. న్యాయవాది అయిన ఆయన చంద్రబాబు అరెస్ట్ సమయంలో జైలులో తరచూ ములాఖత్ అయ్యారు. అధినేత సందేశాన్ని నాయకులకు చేరవేస్తూ సంధానకర్తగా పని చేశారు. వాల్మీకి సామాజికవర్గం ఆయనకు కలిసొచ్చిన మరో అంశం.
Similar News
News March 10, 2025
కర్నూలు జిల్లాలో 349 మంది గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులకు మ్యాథ్స్ పేపర్ 2బి, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు 349 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు. 18,481 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 18,132 మంది హాజరయ్యారు. 349 విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదు.
News March 10, 2025
సమస్యలను పరిష్కరించండి: కర్నూలు జిల్లా కలెక్టర్

పీజీఆర్ఎస్ ద్వారా తీసుకున్న అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు జిల్లా కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ బి.నవ్యతో కలిసి ఆయన వినతులను స్వీకరించారు. అధికారులు క్షేత్రస్థాయిలోని ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని అన్నారు.
News March 10, 2025
మీ ఊర్లో నీటి సమస్య ఉందా?

ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కర్నూలు జిల్లాలో 36°Cల ఉష్ణోగ్రత నమోదవుతోంది. పలు మున్సిపాలిటీలు, గ్రామాల్లో నీటి సమస్య మొదలవుతోంది. ఈ ఏడాది నీటి ఎద్దడి నివారణకు అధికారులు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. జిల్లాలో 889 పంచాయతీలు ఉండగా నిధులు రాగానే ఉండగా సమస్య ఉన్నచోట ట్యాంకర్లతో సరఫరా, బోర్ల మరమ్మతులు, నూతన పైప్‌లైన్ పనులు చేపట్టనున్నారు. మరి మీ ఊర్లో నీటి సమస్య ఉందా? కామెంట్ చేయండి.