News March 23, 2024
కెప్టెన్సీని ఆస్వాదించా: రుతురాజ్
మ్యాచ్ ఆసాంతం కెప్టెన్సీని ఆస్వాదించానని చెన్నై సూపర్ కింగ్స్ సారథి రుతురాజ్ గైక్వాడ్ తెలిపారు. ‘బెంగళూరుతో మ్యాచ్‌లో ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదు. మహీ భాయ్ సూచనలతో ముందుకెళ్లా. సీనియర్లు ఉన్న జట్టుని ఎలా నడిపిస్తాడో అని అందరూ అనుకుని ఉంటారు. కానీ నాకు అలాంటిదేం లేదు. మ్యాచ్‌లో బెంగళూరును 15 పరుగులు తక్కువకే నిలువరించాం. దీంతో మా విజయం సులువైంది’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 2, 2024
తగ్గేదే లే.. జాబ్ కొట్టాల్సిందే
AP: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులతో గ్రంథాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఏపీలో కొద్ది నెలల్లో డీఎస్సీ, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వీటితో పాటు SSC, బ్యాంకులు, ఆర్ఆర్బీకి సంబంధించిన పరీక్షలకు తేదీలు విడుదలయ్యాయి. వచ్చే మూడు నెలల పాటు ఇవి జరగనున్నాయి. దీంతో ఉద్యోగార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
News November 2, 2024
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
అనంత్‌నాగ్ జిల్లాలో శనివారం భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. స్థానికంగా వీరి కదలికలపై సమాచారం అందుకున్న బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో ఒక విదేశీ ఉగ్రవాది సహా మరొకరు మృతి చెందారు. శ్రీనగర్ ఖాన్యార్‌లో ఎదురు కాల్పుల ఘటన జరిగిన కొద్దిసేపటికే ఈ ఎన్కౌంటర్ జరిగింది. శుక్రవారం నుంచి వ్యాలీలో నాలుగు ఉగ్ర ఘటనలు చోటుచేసుకున్నాయి.
News November 2, 2024
సిమెంట్ నేర్పే జీవిత పాఠం!
ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటుంటారు. తాజాగా నిర్మాణాలకు వినియోగించే సిమెంట్ కూడా జీవిత పాఠాన్ని బోధిస్తుందని ఆయన తెలిపారు. ‘ఏదైనా సృష్టించడానికి మీరు మృదువుగా, సరళంగా ఉండాలి. అయితే దీనిని నిలబెట్టుకోడానికి మీరు దృఢంగా మారాల్సి ఉంటుంది’ అని ట్వీట్ చేశారు. దీనిపై కామెంట్?