News March 10, 2025

లక్షెట్టిపేట: కూల్ డ్రింక్ మూత మింగి చిన్నారి మృతి

image

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. లక్షెట్టిపేట మండలంలోని ఊట్కూర్‌కు చెందిన సురేందర్ కుమారుడు రుద్ర అయాన్ (9నెలలు) కూల్ డ్రింక్ మూత మింగి మృతిచెందినట్లు SI సతీశ్ తెలిపారు. సురేందర్ కుటుంబసమేతంగా ఆదివారం కొమ్ముగూడెంలోని ఓ శుభ కార్యానికి హాజరయ్యారు. అక్కడ రుద్ర అయాన్ ప్రమాదవశాత్తు ఓ కూల్ డ్రింక్ మూత మింగాడు. గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు.

Similar News

News March 22, 2026

రేషన్‌కార్డుదారులకు రేపటి నుంచి కిరోసిన్

image

AP: గ్యాస్ కొరత నేపథ్యంలో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం రేపటి నుంచి లీటర్ చొప్పున కిరోసిన్ పంపిణీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రానికి 2,800 కిలో లీటర్ల(ఒక కిలో లీటర్= వెయ్యి లీటర్లు) కిరోసిన్‌ను అందించిన విషయం తెలిసిందే. APని కిరోసిన్ రహిత రాష్ట్రంగా మార్చినప్పటికీ సంక్షోభ పరిస్థితుల కారణంగా మళ్లీ సరఫరా చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

News March 22, 2026

మదనపల్లెలో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

మదనపల్లెలో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం మదనపల్లె నూతన జిల్లా పోలీసు కార్యాలయంలోనే నిర్వహిస్తామని, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదివారం తెలిపారు. ఫిర్యాదుదారులు నేరుగా విన్నవించుకునేందుకు వీలుగా, ఆధునిక వసతులతో కూడిన నూతన కార్యాలయంలోనే ఇకపై ప్రతి సోమవారం ఫిర్యాదుల స్వీకరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా మాట్లాడతారని తెలిపారు.

News March 22, 2026

HYD: ‘లే అమ్మా..’ రాత్రంతా తల్లి శవం వద్ద కూతురు

image

నగర శివారు షాద్‌నగర్‌లోని రంగారెడ్డిగూడకి చెందిన శోభ దారుణ హత్యకు గురైన విషయం <<19447260>>తెలిసిందే<<>>. ఉదయం పొలాల్లో పసిపాప ఏడుపు వినిపించడంతో గమనించిన రైతు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి నుంచి కూతురు తల్లి మృతదేహం వద్దనే ‘లే.. అమ్మా’ అంటూ రోదిస్తున్న దృశ్యం అందరిని కలిచివేసింది.