News March 23, 2024

కదలనున్న ‘వారాహి’.. పిఠాపురం నుంచే ఎందుకంటే..?

image

ఉమ్మడి తూ.గో జిల్లాపై TDP-జనసేన-BJP కూటమి ఫోకస్ పెట్టింది. పిఠాపురం నుంచి పవన్ పోటీ.. ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి వెళ్లనుండటం కేడర్‌లో జోష్ నింపింది. శక్తిపీఠం కొలువై ఉండటం, శ్రీపాద వల్లభుడు జన్మించిన పవిత్ర భూమి కావడంతో పవన్ ‘వారాహి’ ఇక్కడి నుంచే ప్రచారంలో దిగనున్నట్లు తెలుస్తోంది. 3రోజులు అక్కడే ముఖ్య నేతలతో భేటి కానున్నారట. త్వరలో చంద్రబాబు, లోకేశ్ సైతం పర్యటన చేపట్టనున్నారు.

Similar News

News July 8, 2024

ఎమర్జెన్సీని తలపించిన YCP పాలన: పురందీశ్వరి

image

ఏపీలో గత ఐదేళ్ల వైసీపీ పాలన ఎమర్జెన్సీ కాలంనాటి రోజులను తలపించిందని బీజేపీ  స్టేట్ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి అన్నారు. రాజమండ్రిలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. జగన్ ఎంత నొక్కేశారో ప్రజలు గమనించే ఓడించారని తెలిపారు. బాధ్యతతో మెలుగుతూ ఏపీ అభివృద్ధికి సహకరిద్దామని పురందీశ్వరి అన్నారు.

News July 8, 2024

పవన్ కళ్యాణ్‌కు మాటిచ్చి.. రంగంలోకి కలెక్టర్

image

సమస్యల పరిష్కారం నిమిత్తం 2 వారాలకొకసారి కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్ స్వయంగా పిఠాపురంలో అందుబాటులో ఉంటానని ముందుకు వచ్చినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉప్పాడ సభా వేదికపై వెల్లడించిన విషయం తెలిసిందే. పవన్‌కు ఇచ్చిన మాట ప్రకారం ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు కలెక్టర్ షాన్‌మోహన్ సోమవారం పిఠాపురం విచ్చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.

News July 8, 2024

కాకినాడ: BJP గూటికి ఇద్దరు మాజీ కార్పొరేటర్లు

image

కాకినాడకు చెందిన ఇద్దరు మాజీ కార్పొరేటర్లు గోడి సత్యవతి, గరిమెళ్ల శర్మ బీజేపీ గూటికి చేరారు. గోడి సత్యవతి భర్త వెంకట్ సైతం కాషాయ కండువా కప్పుకున్నారు. గతంలో BJPలో ఉన్న వీరు YCPలో చేరారు. తిరిగి ఆదివారం సొంతగూటికి రాగా.. బీజేపీ స్టేట్ చీఫ్, రాజమండ్రి MP పురందీశ్వరి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్‌కుమార్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.