News March 10, 2025
WNP: చేపలవేటకు వెళ్లిన వ్యక్తి మృతి

మదనాపురం మండలంలో చేపలవేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. రామన్పాడుకు చెందిన గిరన్న (55) రోజు మాదిరిగానే తెల్లవారుజామున గ్రామ సమీపంలోని జలాశయంలో చేపలవేటకు వెళ్లాడు. ఎంతకూ ఇంటికి తిరిగిరాకపోవటంతో కుటుంబసభ్యులు జలాయశయంలో గాలించటంతో అతడి మృతదేహం లభ్యమైంది. రెండు కాళ్లకు వల చుట్టుకోవటంతో నీటి మునిగి మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News March 10, 2025
BIG BREAKING: నిలిచిపోయిన X సేవలు

ప్రపంచ వ్యాప్తంగా X(ట్విటర్) సేవలు నిలిచిపోయాయి. సైట్ ఓపెన్ కాకపోవడంతో యూజర్లంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకౌంట్లోకి లాగిన్ కాలేక, లాగిన్ అయినా యాక్సిస్ చేయలేక అసౌకర్యానికి లోనవుతున్నారు. దాదాపు అరగంట నుంచి ట్విటర్ పనిచేయడం లేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మీకూ సేవలు నిలిచిపోయాయా? కామెంట్ చేయండి. దీనిపై సదరు సంస్థ ఇంకా స్పందించలేదు.
News March 10, 2025
బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించిన నార్త్ కొరియా

నార్త్ కొరియా మరోసారి దాని చుట్టుపక్కల ఉన్న అమెరికా మిత్రదేశాల్లో గుబులు రేపింది. పలు బాలిస్టిక్ క్షిపణుల్ని సముద్రంలోకి ప్రయోగించింది. సియోల్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఇటీవల అమెరికా, దక్షిణ కొరియా బలగాలు కలిసి సంయుక్తంగా సైనిక విన్యాసాల్ని ప్రారంభించాయి. అవి తమను ఆక్రమించడానికే అని ఆరోపిస్తున్న ప్యాంగ్యాంగ్, వాటికి హెచ్చరికగా సముద్రంలోకి క్షిపణుల్ని ప్రయోగించినట్లు తెలుస్తోంది.
News March 10, 2025
కరీంనగర్: 322 మంది విద్యార్థుల గైర్హాజరు

కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్ ఎగ్జామ్లో భాగంగా సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ 2 ప్రశాంతంగా ముగిసినట్లు సోమవారం జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 15,381 మంది విద్యార్థులకు గాను 15,059 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షలకు 322 మంది విద్యార్థులు హాజరు కాలేదని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.