News March 10, 2025
నేడు గ్రూప్-1 రిజల్ట్

TG: నేడు గ్రూప్-1 ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించనుంది. ఈ మేరకు ప్రొవిజనల్ మార్కుల జాబితాను రిలీజ్ చేయనుంది. మొత్తం 563 పోస్టులకుగానూ గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన మెయిన్స్‌కు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక రేపు గ్రూప్-2 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, 14న గ్రూప్-3 పరీక్ష జనరల్ ర్యాంకింగ్ జాబితాను రిలీజ్ చేయనున్నారు.
Similar News
News March 10, 2025
BIG BREAKING: నిలిచిపోయిన X సేవలు

ప్రపంచ వ్యాప్తంగా X(ట్విటర్) సేవలు నిలిచిపోయాయి. సైట్ ఓపెన్ కాకపోవడంతో యూజర్లంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకౌంట్‌లోకి లాగిన్ కాలేక, లాగిన్ అయినా యాక్సిస్ చేయలేక అసౌకర్యానికి లోనవుతున్నారు. దాదాపు అరగంట నుంచి ట్విటర్ పనిచేయడం లేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మీకూ సేవలు నిలిచిపోయాయా? కామెంట్ చేయండి. దీనిపై సదరు సంస్థ ఇంకా స్పందించలేదు.
News March 10, 2025
బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించిన నార్త్ కొరియా

నార్త్ కొరియా మరోసారి దాని చుట్టుపక్కల ఉన్న అమెరికా మిత్రదేశాల్లో గుబులు రేపింది. పలు బాలిస్టిక్ క్షిపణుల్ని సముద్రంలోకి ప్రయోగించింది. సియోల్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఇటీవల అమెరికా, దక్షిణ కొరియా బలగాలు కలిసి సంయుక్తంగా సైనిక విన్యాసాల్ని ప్రారంభించాయి. అవి తమను ఆక్రమించడానికే అని ఆరోపిస్తున్న ప్యాంగ్యాంగ్, వాటికి హెచ్చరికగా సముద్రంలోకి క్షిపణుల్ని ప్రయోగించినట్లు తెలుస్తోంది.
News March 10, 2025
నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థులు

AP: MLA కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ముగ్గురు టీడీపీ నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి అభ్యర్థులు కావలి గ్రీష్మ, బీదా రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు నామినేషన్ పత్రాలను అందించారు. అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేశ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు.