News March 10, 2025
MHBD: గొంతులో పల్లీ ఇరుక్కుని బాలుడి మృతి.. UPDATE

గొంతులో పల్లీ ఇరుక్కుని MHBD జిల్లా గూడురు మండలంలో <<15703711>>బాలుడు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. నాయకపల్లికి చెందిన వీరన్న, కల్పనలకు ఇద్దరు కూతుళ్ల తర్వాత 3వ సంతానం కొడుకు అక్షయ్(18 నెలలు). ఈనెల 7న బాలుడు పల్లి గింజను మింగాడు. దగ్గడం గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లినట్లు డాక్టర్లు గుర్తించారు. MGMలో చికిత్స పొందుతూ శ్వాస ఆడక ఆదివారం మృతి చెందాడు.
Similar News
News March 18, 2026
అనంతపురం మున్సిపల్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాధ్యతలు

అనంతపురం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం జారీ చేసిన GO 284 ప్రకారం ఈ నియామకం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. నగర పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించి, పౌరులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని తెలిపారు.
News March 18, 2026
రేపు తిరుపతికి అచ్చంపేట నుంచి ఆర్టీసీ బస్సు రద్దు

ఈనెల 19 ఉగాది పర్వదినం సందర్భంగా అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి తిరుపతి పుణ్యక్షేత్రానికి బయలుదేరే ఆర్టీసీ బస్సును రద్దు చేసినట్లు అచ్చంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసాద్ తెలిపారు. అదేవిధంగా ఈ నెల 20న తిరుపతి నుంచి అచ్చంపేటకు వచ్చే బస్సును రద్దు చేయడం చేశారు. ప్రయాణికులు గమనించాలని ఆయన కోరారు.
News March 18, 2026
తాళ్లూరు: లేఔట్లను పరిశీలించిన జేసీ

ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో జాయింట్ కలెక్టర్ కల్పనకుమారి బుధవారం పర్యటించారు. లేఅవుట్ అప్రూవల్ కోసం పెండింగ్‌లో ఉన్న పలు సర్వే నంబర్లలోని భూములను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వ, ప్రైవేటు భవనాల వివరాలను ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో నిబంధనల అమలును తనిఖీ చేశారు. ఈ పర్యటనలో అద్దంకి ఆర్డీవోతో పాటు పలువురు తహశీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.


