News March 10, 2025
వరంగల్ జిల్లాలో ప్రమాదకరంగా SRSP

తీగరాజుపల్లి వద్ద గల SRSP కాలువలో పడి మేచరాజుపల్లికి చెందిన ముగ్గురు శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే తరహా ఘటన జరగడం రెండోసారి కావడంతో జిల్లా ప్రజలు భయపడుతున్నారు. జిల్లాలోని అక్కడక్కడ SRSP కాలువ పక్కన గల రహదారులు ప్రమాదకరంగా ఉన్నాయని ప్రయాణికులు,స్థానికులు చెబుతున్నారు. బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నామని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Similar News
News March 10, 2025
ప్రజల నుంచి అర్జీలు తీసుకున్న బాపట్ల జేసీ

బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం సోమవారం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలుసుకున్నారు. వారి నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని బాధితులకు సంయుక్త కలెక్టర్ హామీ ఇచ్చారు.
News March 10, 2025
IPLలో ఆ యాడ్స్ బ్యాన్ చేయండి: కేంద్రం

మరికొన్ని రోజుల్లో IPL టోర్నీ ప్రారంభం కానుండగా కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిషేధించిన వాటితో పాటు పొగాకు, మద్యం ప్రకటనలను నిషేధించాలని కోరుతూ BCCIతో పాటు IPL ఛైర్మన్‌కు లేఖ రాసింది. అలాగే, క్రీడాకారులు, కామెంటేటర్స్ కూడా ప్రమోట్ చేయొద్దని ఆరోగ్య శాఖ డైరెక్టర్ లేఖలో పేర్కొన్నారు. IPLను యూత్ ఎక్కువగా చూస్తుండటంతో పొగాకు, మద్యం యాడ్స్ వీరిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
News March 10, 2025
అల్లూరి జిల్లాలో 115 మంది గైర్హాజరు

అల్లూరి జిల్లాలో ఇంటర్ సెకండియర్ వ్యాథ్స్, జువాలజి, హిస్టరీ పరీక్షలు సోమవారం జరిగాయి. ఈ జనరల్ పరీక్షలకు 26పరీక్ష కేంద్రాల్లో 4,315 మంది హాజరు కావాల్సి ఉండగా 4,200 మంది పరీక్షకు హాజరయ్యారు. 115 మంది పరీక్షకు హాజరుకాలేదని ఇంటర్మీడియట్ విద్యాశాకాధికారి అప్పలరాం తెలిపారు. ఒకేషనల్ పరీక్షలకు 1217మందికి 1136మంది రాశారని వెల్లడించారు. జిల్లా అంతటా ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని పేర్కొన్నారు.