News March 23, 2024
హిందూ మహిళ బొట్టు పెట్టుకోవడం మతపరమైన బాధ్యత: కోర్టు
ఓ విడాకుల కేసు విచారణ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఫ్యామిలీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హిందూ మహిళ నుదుటిన బొట్టు పెట్టుకోవడం మతపరమైన బాధ్యత అని, అది ఆమెకు పెళ్లయిందనే విషయాన్ని తెలియజేస్తుందని పేర్కొంది. వరకట్నం కోసం భర్త శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కోర్టుకు తెలిపిన భార్య.. ఎలాంటి ఆధారాలను చూపలేకపోయిందని న్యాయమూర్తి చెప్పారు. వెంటనే ఆమె భర్త ఇంటికి వెళ్లాలని సూచించారు.
Similar News
News November 2, 2024
ఈనెల 5న రాష్ట్రానికి రాహుల్ గాంధీ: టీపీసీసీ చీఫ్
TG: దేశవ్యాప్తంగా కులగణన జరగాలన్నది తమ పార్టీ నిర్ణయమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈనెల 5న బోయినపల్లిలో కులగణనపై సలహాలు, సూచనల కోసం నిర్వహించే కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొంటారని పేర్కొన్నారు. కులగణన ప్రక్రియకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటారని చెప్పారు.
News November 2, 2024
ధోనీ రికార్డును పంత్ అధిగమిస్తాడా?
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో అర్ధ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో భారతీయ వికెట్ కీపర్‌లలో అత్యధిక సార్లు 50+ స్కోర్ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచారు. మహేంద్ర సింగ్ ధోనీ 39 సార్లు 50+ రన్స్ బాది ప్రథమ స్థానంలో ఉండగా పంత్ 19 అర్ధ సెంచరీలు చేశారు. మూడు, నాలుగు స్థానాల్లో ఫారుఖ్ ఇంజినీర్ (18), సయ్యద్ కిర్మాణి (14) ఉన్నారు.
News November 2, 2024
అమితాబ్ రికార్డును బ్రేక్ చేయగలరా?
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన ‘షోలే’ సినిమా 1975లో రిలీజై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా నెలకొల్పిన రికార్డును ఇప్పటి వరకు ఏ చిత్రం బ్రేక్ చేయలేకపోయింది. ఈ సినిమా ఏకంగా 25 కోట్ల టికెట్లను విక్రయించినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ఇది భారతీయ సినీ చరిత్రలో అత్యధికం. రాజమౌళి ‘బాహుబలి-2’ మూవీ టికెట్లు 10కోట్ల కంటే ఎక్కువే విక్రయించారు. ఇప్పుడు ఇలాంటివి సాధ్యమవుతాయా?