News March 10, 2025
వత్సవాయి: లవ్ ఫెయిల్యూర్.. యువతి ఆత్మహత్య

ప్రేమ విఫలమవడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన వత్సవాయి మండలం ఆలూరుపాడు గ్రామంలో జరిగింది. MS చదువుతున్న శ్రావణి(27)కి హైదరాబాద్‌కి చెందిన భానుప్రకాశ్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ప్రేమ విఫలమవడంతో శ్రావణి గడ్డి మందు తాగింది. తల్లిదండ్రులు హుటాహుటిన ఆమెను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. శ్రావణి ఆదివారం రాత్రి మరణించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News March 10, 2025
బాపట్ల పీజీఆర్‌ఎస్‌కు 89 అర్జీలు

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో 89 అర్జీలు అందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం జరిగే కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు.
News March 10, 2025
జగిత్యాల ప్రజావాణిలో 50 ఫిర్యాదులు

జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 50 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బిఎస్. లత, ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
News March 10, 2025
పాకిస్థాన్‌లో ఆడినా టీమ్ ఇండియానే విజేత అయ్యుండేది: అక్రమ్

అన్ని జట్లూ పాక్‌లో ఆడితే, భారత్ మాత్రం దుబాయ్‌లో ఆడి అన్యాయంగా గెలిచిందంటూ పాక్ అభిమానులు చేస్తున్న ఆరోపణల్ని ఆ దేశ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ కొట్టిపారేశారు. ‘ఈ భారత జట్టు ప్రపంచంలో ఎక్కడ ఆడినా కప్ కచ్చితంగా గెలిచి ఉండేది. వారు పాక్ వచ్చి ఆడినా గెలిచేవారు. టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా గెలిచారు. భారత్‌కున్న క్రికెట్ బలానికి అదే నిదర్శనం’ అని కొనియాడారు.