News March 10, 2025
యాదాద్రి శ్రీవారి రథోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మధుర ఘట్టమైన దివ్య విమాన రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతురావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ప్రముఖ సినీ గాయకురాలు గీతా మాధురి భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కర్ రావు,ఛైర్మన్ నరసింహమూర్తి దంపతులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
Similar News
News July 6, 2025
జగిత్యాల: మాజీ మంత్రి జీవన్ రెడ్డి హెచ్చరిక

జగిత్యాల జిల్లాలో మత్స్యకార సంఘాలకు రావాల్సిన వేట హక్కులను కాంట్రాక్టర్లకు అప్పగించడాన్ని మాజీమంత్రి జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ మంత్రులకు లేఖ రాసిన ఆయన, ప్రభుత్వం తీసుకుంటున్న టెండర్ విధానం మత్స్యకారులను అణగదొక్కేలా ఉందన్నారు. వేట హక్కులు స్థానిక సంఘాలకే ఇవ్వాలని, లేకపోతే జగిత్యాల జిల్లా వ్యాప్తంగ ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. మత్స్యకారుల జీవనాధారాన్ని కాపాడాలన్నారు.
News July 6, 2025
రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: ములుగు కలెక్టర్

ములుగు కలెక్టరేట్‌లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. సోమవారం జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క పర్యటన నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు. వచ్చే సోమవారం యధావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
News July 6, 2025
అనకాపల్లి: ‘ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేయ్యోచ్చు’

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాలేని వారు ఆన్‌లైన్‌లో ఫిర్యాదులను నమోదు చేయవచ్చని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదివారం పేర్కొన్నారు. సమస్యలపై meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో ఫిర్యాదు చేయడానికి అవకాశం కల్పించామన్నారు. వారి సమస్యల పరిష్కార స్థితిని 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు.