News March 10, 2025
మెదక్: కడుపునొప్పితో వివాహిత సూసైడ్

కడుపునొప్పి భరించలేక వివాహిత సూసైడ్ చేసుకుంది. SI రంజిత్ రెడ్డి వివరాలిలా.. సంగారెడ్డి జిల్లా మర్పెల్లికి చెందిన మహేశ్వరి(27)కి కౌడిపల్లి మం. మహమ్మద్‌నగర్‌కు చెందిన అనిల్‌తో ఏడేళ్ల క్రితం పెళ్లైంది. కొడుకు పుట్టినప్పటి నుంచి మహేశ్వరి కడుపునొప్పితో బాధపడుతుంది. పలుచోట్ల చికిత్స చేయించినా తగ్గలేదు. మనస్తాపం చెందిన ఆమె నిన్న ఇంట్లో ఉరేసుకుంది. మహేశ్వరి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Similar News
News March 10, 2025
మెదక్: పరీక్షకు 5,529 విద్యార్థులు హాజరు

ఇంటర్మీడియట్ సెకండియర్ ఇంగ్లీష్ సెకండ్ పేపర్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 5,640 విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 5,529 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 111 మంది వివిధ కారణాల వల్ల హాజరు కాలేదని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవి తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.
News March 10, 2025
రేపు బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం.. దిశానిర్దేశం చేయనున్న KCR

రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్‌ఎస్ సన్నద్ధమవుతుంది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ ఉభయ సభల సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణభవన్‌లో మంగళవారం 1 గంటకు బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు.
News March 10, 2025
వర్గల్: పెళ్లిలో డిజిటల్ కట్నాల చదివింపులు

పెళ్లిలో ఇంతకాలం పెళ్లికూతురు, పెళ్లికొడుకు కట్నాల చదివింపులు రాతపూర్వకంగా ఉండేవి. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం కొత్త ట్రెండ్ మొదలైంది. అంతా డిజిటలైజేషన్ కావడంతో వర్గల్ మండలం గౌరారంలో ఆదివారం జరిగిన ఒక వివాహ వేడుకలలో పెళ్లికొడుకు, పెళ్లికూతురు తరపున చదివింపుల కార్యక్రమంలో ఫోన్‌పే స్కానర్ ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసిన స్కానర్ ద్వారా చదివింపులు చేపట్టారు.