News March 10, 2025

KMR: నేడు ప్రజావాణి: జిల్లా కలెక్టర్

image

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి నేడు (సోమవారం) కలెక్టర్ సమావేశం మందిరం వేదికగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆశిష్ సాంగ్వాన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల సౌకర్యార్థం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి దరఖాస్తులు స్వీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News November 8, 2025

ఇజ్రాయెల్ PM అరెస్టుకు తుర్కియే వారెంట్

image

గాజాలో విధ్వంసం, నరమేధానికి కారణమంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అరెస్టుకు తుర్కియే వారెంట్ జారీచేసింది. ఆయనతో పాటు మంత్రులు కట్జ్, ఇతమాన్ బెన్ గ్విర్, ఇతర అధికారులతో మొత్తం 37 మందిని వారెంటులో చేర్చినట్లు ఇస్తాంబుల్ ప్రాసిక్యూటర్స్ ఆఫీస్ పేర్కొంది. అయితే ఇజ్రాయెల్ దీన్ని ఖండించింది. తుర్కియే నిరంకుశ పాలకుడు ఎర్డోగన్ ప్రజలను మభ్యపెట్టే స్టంట్ ఇది అని విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ విమర్శించారు.

News November 8, 2025

HYD-VJD హైవే 8 లేన్లకు విస్తరణ: కోమటిరెడ్డి

image

HYD-VJD జాతీయ రహదారి 8 లేన్లకు విస్తరించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. రూ.10,400 కోట్లతో ఈ రహదారిని విస్తరించనున్నట్లు తెలిపారు. దండు మల్కాపురం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వరకు ఈ రోడ్డును ఎక్స్ ప్యాండ్ చేస్తామన్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న 4 వరుసల రోడ్డు 8 వరుసలుగా మారనుంది. గతంలో ఆరు లేన్లుగా నిర్మించాలనుకున్నప్పటికీ రద్దీ దృష్ట్యా 8 లేన్లుగా విస్తరించనున్నారు.

News November 8, 2025

కంచిపల్లి శ్రీను హత్య కేసులో 8 మంది అరెస్టు

image

అమలాపురం మండలం కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీను హత్య కేసులో 8 మందిని అరెస్టు చేశామని ఎస్పీ రాహుల్ మీనా శనివారం మీడియా సమావేశంలో తెలిపారు. తన ఉనికిని చాటుకునేందుకే ప్రధాన నిందితుడు కాసుబాబు ఈ హత్యకు పాల్పడినట్లు తెలిపారు. దూషిస్తూ శ్రీను విడుదల చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పరువు పోతుందని భావించి హత్యకు ప్లాన్ చేశాడని చెప్పారు.