News March 10, 2025

వరంగల్ జిల్లాలో ప్రమాదకరంగా SRSP

image

తీగరాజుపల్లి వద్ద గల SRSP కాలువలో పడి మేచరాజుపల్లికి చెందిన ముగ్గురు శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే తరహా ఘటన జరగడం రెండోసారి కావడంతో జిల్లా ప్రజలు భయపడుతున్నారు. జిల్లాలోని అక్కడక్కడ SRSP కాలువ పక్కన గల రహదారులు ప్రమాదకరంగా ఉన్నాయని ప్రయాణికులు,స్థానికులు చెబుతున్నారు. బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నామని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Similar News

News March 25, 2026

WGL: జాతీయ గ్రామీణ ఉపాధి పనులపై కలెక్టర్ సమీక్ష

image

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల్లో ఇంకా అసంపూర్తిగా ఉన్న వాటి పురోగతిపై కలెక్టర్ డా.సత్య శారద అధ్యక్షతన బుధవారం సమీక్షించారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల్లో కొన్ని పూర్తికాకుండా ఉండటానికి గల కారణాలను పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పనులను మండలాల వారీగా గుర్తించి పూర్తి చేయాలన్నారు.

IBC సవరణ బిల్లుపై లోక్‌సభలో కడియం కావ్య గళమెత్తారు

image

IBC సవరణ బిల్లు–2025పై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో తీవ్ర విమర్శలు చేశారు. ఈ బిల్లు ప్రజల డబ్బును రక్షించేలా లేదని, హెయిర్‌కట్స్ పెరిగి ప్రమోటర్లు బాధ్యత తప్పించుకుంటున్నారని అన్నారు. NCLTలో ఖాళీలు ఉన్నపుడు 14 రోజుల టైమ్‌లైన్ సాధ్యం కాదని ప్రశ్నించారు. మోసాలపై కఠిన చర్యలు లేవని ఆందోళన వ్యక్తం చేస్తూ, బిల్లును పునఃపరిశీలనకు పంపాలని డిమాండ్ చేశారు.