News March 10, 2025

మీ ఊర్లో నీటి సమస్య ఉందా?

image

ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నంద్యాల జిల్లాలో 36°Cల ఉష్ణోగ్రత నమోదవుతోంది. పలు మున్సిపాలిటీలు, గ్రామాల్లో నీటి సమస్య మొదలవుతోంది. ఈ ఏడాది నీటి ఎద్దడి నివారణకు అధికారులు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. జిల్లాలో 457 పంచాయతీలు ఉండగా నిధులు రాగానే ఉండగా సమస్య ఉన్నచోట ట్యాంకర్లతో సరఫరా, బోర్ల మరమ్మతులు, నూతన పైప్‌లైన్ పనులు చేపట్టనున్నారు. మరి మీ ఊర్లో నీటి సమస్య ఉందా? కామెంట్ చేయండి.

Similar News

News November 7, 2025

నిజామాబాద్: మలావత్ పూర్ణకు పితృ వియోగం

image

అత్యంత పిన్న వయస్సులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించిన మలావత్ పూర్ణకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి దేవీదాస్(50) శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు. గత కొంతకాలంగా కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కోమాలో ఉన్న ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు. అంత్యక్రియలు సాయంత్రం ఆయన స్వస్థలం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News November 7, 2025

వేమూరి వినోద్ అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

image

AP: కర్నూలు బస్సు <<18110276>>ప్రమాద ఘటన<<>>లో వి.కావేరి ట్రావెల్స్ యజమాని, A2 వేమూరి వినోద్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ వెల్లడించారు. కర్నూలు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. OCT 28న A1 డ్రైవర్ లక్ష్మణ్‌ను అరెస్టు చేశారు. గత నెల జరిగిన ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.

News November 7, 2025

‘కూటమిగా పోరాడదాం.. మెంటాడను సాధిద్దాం’

image

మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలో కొనసాగించేకు ఉమ్మడిగా పోరాడాలని జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు అన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన నాయకులు సమావేశం అయ్యారు. మెంటాడ మండలం పార్వతీపురం జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. త్వరలో మండల ప్రజల అభిప్రాయాలను ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులకు తెలియజేస్తామన్నారు.