News March 10, 2025
మంచిర్యాల జిల్లాకు రూ.600 కోట్లు

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాలకు రూ.200 కోట్ల చొప్పున రూ.600 కోట్లు మంజూరయ్యాయి.
Similar News
News November 5, 2025
NGKL: భక్తి జ్వాలలో ప్రకాశిస్తున్న కార్తీక పౌర్ణమి

నాగర్ కర్నూల్ జిల్లావ్యాప్తంగా ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, దీపాలు వెలిగించి, శివలింగానికి అభిషేకాలు చేస్తున్నారు. ఆలయాల ప్రాంగణాలు దీపాల కాంతులతో వెలిగిపోతుండగా, భజనలు, హారతులతో భక్తి వాతావరణం నెలకొంది. కాగా, ఈరోజు పుణ్యకార్యాలు, దానధర్మాలు చేయడం అత్యంత శుభమని పురాణాలు చెబుతున్నాయి.
News November 5, 2025
వరంగల్: 95 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

మద్యం తాగి వాహనాలు నడపటం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 95 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 53, సెంట్రల్ జోన్ పరిధిలో 18, వెస్ట్ జోన్ పరిధిలో 15 ఈస్ట్ జోన్ పరిధిలో 9 కేసులను పోలీసులు నమోదు చేశారు.
News November 5, 2025
నేడు కార్తీక పౌర్ణమి.. మాంసాహారానికి దూరంగా ఉండాలన్న పండితులు

అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు మాంసాహారానికి దూరంగా ఉండాలని, శాకాహారమే తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఉపవాసం ఆచరించి నియమాలు పాటిస్తే శుభఫలితాలు పొందుతారని, సాయంత్రం దీపారాధన తర్వాత పండ్లు తినొచ్చని అంటున్నారు. అలాగే ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయాలని, ఈ రోజు వెండి పాత్రలు, పాలను ఎవరికీ దానం చేయకూడదని పేర్కొంటున్నారు. ఇంట్లో ఏ మూలా చీకటి ఉండకూడదని వివరిస్తున్నారు.


