News March 23, 2024

ప్రకాశం జిల్లాలో YCP ఇప్పటివరకూ గెలవని స్థానాలు

image

2019లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా 151 సీట్లు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 9 స్థానాలు కైవసం చేసుకుంది. కానీ వైసీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో ఇప్పటికీ కొన్ని చోట్ల ఆ పార్టీ గెలవలేకపోయింది. అవే చీరాల, కొండపి, పర్చూరు స్థానాలు. అభ్యర్థుల మార్పుతో ఎలాగైనా ఈసారి గెలవాలని గట్టి పట్టుదలతో అధిష్ఠానం భావిస్తోంది. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఆ స్థానాల్లో జెండా ఎగురవేయాలని భావిస్తోంది.

Similar News

News September 5, 2025

ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: సబ్ కలెక్టర్

image

మార్కాపురం MPDO కార్యాలయంలో ఎరువుల నియంత్రణ చట్టంపై వ్యవసాయ సహాయకులకు, డీలర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ S.V.త్రివినాగ్ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. ఎరువుల కొరత సృష్టిస్తే డీలర్షిప్ రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎరువులను MRP ధరలకే విక్రయించాలని సూచించారు. MRO చిరంజీవి, SI సైదుబాబు పాల్గొన్నారు.

News September 4, 2025

ప్రకాశం జిల్లాలో మరో 4 బార్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లా వ్యాప్తంగా ఓపెన్ కేటగిరిలో నాలుగు బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం గురువారం తెలిపారు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో 2, మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో 2 బార్లకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈనెల 14వ తేదీ సాయంత్రం 6 గంటలలోగా దరఖాస్తులు అందించాలని చెప్పారు. 15న లాటరీ తీస్తామని, ఆన్‌లైన్, ఆఫ్‌‌లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు.

News September 4, 2025

ప్రకాశం జిల్లాలో మరో 4 బార్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లావ్యాప్తంగా ఓపెన్ కేటగిరిలో నాలుగు బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం గురువారం తెలిపారు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో 2, మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో 2 బార్లకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈనెల 14వ తేదీ సాయంత్రం 6 గంటలలోగా దరఖాస్తులు అందించాలని చెప్పారు. 15న లాటరీ తీస్తామని, ఆన్‌లైన్, ఆఫ్‌‌లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు.