News March 10, 2025
దుబ్బాక: కుమార్తెను చూసేందుకు వెళ్తూ తండ్రి మృతి

రోడ్డు ప్రమాదంలో <<15703438>>యువకుడు<<>> మృతిచెందిన విషయం తెలిసిందే. కూతురు పుట్టిందన్న సంతోషంలో వెళ్తున్న యువకుడి మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పోలీసుల వివరాలిలా.. పోతారం వాసి నరేశ్(28)కు నెల క్రితం కూతురు పుట్టింది. కామారెడ్డి జిల్లా మల్కాపూర్‌లోని అత్తగారింట్లో ఉన్న భార్య, పాపను తీసుకురావడానికి ఆదివారం బైక్‌పై వెళ్తున్నాడు. ఆకారం శివారులో ఆటో ఢీకొట్టడంతో స్పాట్‌లోనే చనిపోయాడు. ఘటనపై కేసు నమోదైంది.
Similar News
News March 10, 2025
మేడ్చల్ కలెక్టరేట్ ప్రజావాణిలో 55 ఫిర్యాదులు

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యల అర్జీలను డీఆర్ఓ హరిప్రియతో కలిసి అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, విజయేందర్ రెడ్డి స్వీకరించారు. మేడ్చల్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 55 ఫిర్యాదులు అందాయన్నారు. ఫిర్యాదులను పరిష్కరించాలని పలు శాఖల అధికారులను ఆదేశించారు.
News March 10, 2025
P24 సర్వే శ్రద్ద పెట్టి చేయాలి: జిల్లా కలెక్టర్

ఆకివీడులో జరుగుతున్న P4 సర్వేను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో P4 సర్వే నిర్వహిస్తున్నామన్నారు. సర్వే చేసేటప్పుడు శ్రద్ధ పెట్టి చేయాలని, ఎలాంటి తప్పులు ఉండకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, వార్డు సచివాలయ అధికారి దాసిరెడ్డి పాల్గొన్నారు
News March 10, 2025
‘డైటింగ్’ చేసి యువతి మృతి

బరువు తగ్గాలని చేసిన ‘డైటింగ్’ ఓ అమ్మాయి ప్రాణం తీసింది. కేరళలోని కూతుపరంబకు చెందిన శ్రీనంద(18) ఆన్‌లైన్‌లో చూసి లావు తగ్గాలనుకుంది. ఆహారం తినడం మానేసి నీరు మాత్రమే తాగేది. ఎక్సర్‌సైజ్‌లు చేసింది. దీంతో శ్రీనంద ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఆమెను ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు చూసి షాక్ అయ్యారు. శ్రీనంద బరువు 24 కేజీలకు దిగజారింది. షుగర్ లెవెల్స్, సోడియం, BP పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయింది.